V The Movie: ‘వి’ ఫలితంతో నిర్మాతలకు షాకిస్తున్న ఓటిటి సంస్థలు..

నాని వి సినిమా (nani sudheer V movie)

OTT release: ఓటిటి రిలీజ్.. ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతలను బాగా ఊరిస్తున్న పదం ఇది. కరోనా కారణంగా ఎలాగూ ఇప్పట్లో థియేటర్స్ అయితే ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు.

  • Share this:
ఓటిటి రిలీజ్.. ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతలను బాగా ఊరిస్తున్న పదం ఇది. కరోనా కారణంగా ఎలాగూ ఇప్పట్లో థియేటర్స్ అయితే ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ ధైర్యం చేసిన తెరిచినా ప్రేక్షకులు వచ్చేవరకు కూడా అనుమానమే. అలాంటి సమయంలో సినిమాలు విడుదల చేసి చేతులు కాల్చుకోడానికి ఏ నిర్మాత కూడా సిద్ధంగా లేడు. దాంతో మంచి రేట్ వస్తే ఓటిటిలో విడుదల చేసి చేతులు దులిపేసుకోవడమే మంచిది అనుకుంటున్నారు.

నాని వి మూవీ కొత్త పోస్టర్ (nani v movie)
నాని వి మూవీ కొత్త పోస్టర్ (nani v movie)


ఈ క్రమంలోనే అందరికంటే ముందు దిల్ రాజు ఓ అడుగు ముందుకేసి తన వి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసాడు. సెప్టెంబర్ 5న రిలీజ్ చేసిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజే ఎంతమంది చూసినా కూడా పూర్తిగా పెదవి విరిచారు ఆడియన్స్. నాని 25వ సినిమా ఇలా ఉందా.. ఇలాంటి సినిమా కోసమా అమెజాన్ 33 కోట్లు పోసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.

సోలో బ్రతుకే సో బెటర్ (solo brathuke so better)
సోలో బ్రతుకే సో బెటర్ (solo brathuke so better)


ఇప్పుడు సినిమాకు వచ్చిన టాక్ చూసిన తర్వాత అమెజాన్‌కు నిజంగానే అన్ని కోట్లు వెనక్కి వస్తాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు ఇప్పుడు వి ఫలితం చూసిన తర్వాత ఓటిటి సంస్థలు మాట మార్చేస్తున్నాయి. ఇంతకుముందు నిర్మాతలతో కుదుర్చుకున్న బేరం కంటే కూడా తక్కువ ఇస్తామంటూ బేరాలు ఆడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనుష్క నిశ్శబ్ధం అమెజాన్.. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ జీ 5 సంస్థలు కొనేస్తున్నాయి.

అనుష్క శెట్టి (Instagram/Photo)
అనుష్క శెట్టి (Instagram/Photo)


ఈ క్రమంలోనే ముందు చెప్పిన రేట్ కంటే కూడా ఇప్పుడు 20 శాతం తక్కువ ఇస్తామంటూ ఓటిటి సంస్థలు నిర్మాతలకు చెప్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. వి ఫలితం చూసిన తర్వాత ముందు చెప్పిన భారీ రేట్ అయితే వర్కవుట్ కాదనే యోచనలో ఉన్నాయి ఓటిటి సంస్థలు. కాస్త తక్కువకు కొంటేనే సినిమా అటూ ఇటూగా ఉన్నా సేఫ్ అవుతాం అనే ఆలోచనలో ఉన్నారు వాళ్లు. మరోవైపు నిర్మాతలు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. మరి చూడాలిక.. ఓటిటి సంస్థల పట్టు నెగ్గుతుందో లేదంటే నిర్మాతలే గెలుస్తారో..?
Published by:Praveen Kumar Vadla
First published: