Home /News /movies /

OTT MOVIES WEEKEND MOVIES KNOW THE MOVIES RELEASED IN OTT THIS WEEK EVK

OTT Movies: వీకెండ్ మూవీస్‌.. ఈ వారం ఓటీటీలో విడుద‌లైన సినిమాలు ఇవే!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

OTT Movies 2022 | ఓటీటీల కార‌ణంగా భాషా భేదం లేకుండా ప్రేక్ష‌కులు అన్ని భాష‌ల సినిమాలు చూస్తున్నారు. ఈ వారం ఓటీటీలో విడుద‌లైన సినిమాల‌పై ఓ లుక్ వేయండి.

    వీకెండ్ వ‌చ్చేసింది. శ‌ని, ఆదివారం ఏం సినిమా చూడాలి అని ఆలోచిస్తున్నారా.. ఈ వారం అన్ని ఓటీటీ (OTT) ల్లో కొత్త సినిమాలు ప్ర‌త్యేక్ష‌మ‌య్యాయి. కొన్ని ఇప్ప‌టికే థియేట‌ర్ల‌ల‌తో వీక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కోగా.. కొన్ని నేరుగా ఓటీటీల్లోకి వ‌చ్చాయి. ప్ర‌ముఖ ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) , అమెజాన్‌ (Amazon), ఆహా, డిస్ని+హాట్‌స్టార్ వంటి అన్ని ఓటీటీ (OTT)లు కొత్త సినిమాల‌ను అందించాయి. ఓటీటీల కార‌ణంగా భాషా భేదం లేకుండా ప్రేక్ష‌కులు అన్ని భాష‌ల సినిమాలు చూస్తున్నారు. కొత్త ఏడాదిలో ఈ వారం ఓటీటీలో విడుద‌లైన సినిమాల‌పై ఓ లుక్ వేయండి. ఈ వీకెండ్ (Week End) ఎంజాయ్ చేయండి.

    ఎల్లం షెరియకుమ్ (Zee5)
    ఇది పూర్తిగా రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే మ‌ల‌యాళ‌ సినిమా. ఇది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమార్తె ప్రత్యర్థి పార్టీకి చెందిన యువ కార్యకర్తతో పారిపోవడం కథ. 1980-90ల‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఈ సినిమాలో చూపించారు. పొలిటిక‌ల్ డ్రామా అంటే ఇష్ట‌ప‌డే వారికి ఈ సినిమా న‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌.

    బడవ రాస్కల్ (Voot)
    ఇది క‌న్న‌డ సినిమా.  ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక రాజకీయనాయకుడి కుమార్తెతో ప్రేమలో ఉన్నందున ఒక ముఠా అపహరించబడడం చుట్టూ తిరుగుతుంది. యాక్ష‌న్ మిక్సెడ్ ల‌వ్ ట్రాక్‌తో న‌డుస్తుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కు పోటీగా న‌టించిన జాలీ రెడ్డి క్యారెక్టర్‌వేసిని ధ‌న‌జ‌న్ ఇందులో హీరో కావ‌డం విశేషం.

    Shruti Haasan: బ‌ర్త్‌డే బ్యూటీ శ్రుతీహాస‌న్‌.. ఫేవరెట్ ఫుడ్‌, ఫ్ల‌వ‌ర్స్ ఏంటో తెలుసా?


    అర్జున ఫ‌ల్గున (Aha)
    శ్రీ విష్ణు, అమృత అయ్య‌ర్ నటించిన అర్జున ఫ‌ల్గున పూర్తిగా తెలుగు డ్రామా. తెలుగు పల్లెటూర్‌లో స్నేహితుల మ‌ధ్య న‌డిచే క‌థ‌గా దీన్ని రూపొందించారు. కాస్త స‌స్పెన్స్‌, థ్రిల్‌, యాక్ష‌న్ క‌థాంశాలతో ఈ సినిమా హ‌స్యంగా సాగుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకు ప్ల‌స్‌.

    OTT Movies: "ఆహా"లో దుమ్మురేపిన‌ డ‌బ్ మూవీస్.. ఈ ఏడాది ఇవే టాప్‌!

    ఆహా (Zee5)
    స్పోర్ట్స్, సోషల్ మెసేజ్‌తో ఈ సినిమా న‌డుస్తుంది. సామాజిక అంశాలు, క్రీడా రాజ‌కీయాలు.. ఈ సినిమాలో చూపించారు. మలయాళంలో టగ్-ఆఫ్-వార్ అయిన వడంవలి , కేరళలో క్రీడగా చాలా పెద్దది. ఈ చిత్రం 80లు మరియు 90లలో బాగా ప్రాచుర్యం పొందిన 'ఆహా నీలూర్' టీమ్ నుంచి ప్రేరణ పొందిం రూపొందించారు.

    Prabhas Remunaration: అన్ని రూ.కోట్లా.. "స‌లార్" మూవీకి ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్‌.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌!


    బ్రో డాడీ (Disney+HotStar)
    మ‌ల‌యాళ రిశ్రమలోని ఇద్దరు పెద్ద స్టార్స్ అయిన మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం నేరుగా OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది. పృథ్వీరాజ్ మరియు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ తండ్రి కొడుకుగా ఈ సినిమాలో క‌నిపిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు ఫ్యామిలీ కామెడీతో ఈ సినిమా న‌డుస్తుంది. సినిమాలో మోహ‌న్‌లాల్‌, ఫృథ్వీ కెమిస్ట్రీ బాగుంద‌ని చాలా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Aha OTT Platform, Disney+ Hotstar, Ott platform, Telugu Cinema, Zee5

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు