OTT MOVIES NEW WEB SERIES AND MOVIES NOW AVAILABLE IN OTT PLATFORM IN THIS WEEK KNOW DETAILS EVK
OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు.. వెబ్‌సిరీస్‌లు ఇవే!
ప్రతీకాత్మక చిత్రం
OTT Movies: ప్రస్తుతం కరోనా.. ఒమిక్రాన్ దెబ్బకు ఓటీటీలపై జనం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొత్త సినిమాలు తొందరగా ఓటీటీల బాట పడుతుంటే.. ఓటీటీలు కూడ తమకు మాత్రమే ప్రత్యేకమైన వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ ఏడాది చివరి వారం ప్రేక్షకులను అలరించనున్న ఓటీటీ సినిమాల వివరాలు ఇవే!
కరోనా (Corona) పరిస్థితుల వల్ల కొన్నాళ్లు మూత పడిన థియేటర్స్ ఇటీవల తెరుచుకున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అయితే పలు చిత్రాలు ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలయ్యాయి. అందులో కొన్ని ఈ వారం ఓటీటీ (OTT)ల ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాయి. పలు వెబ్ సిరీస్‌లు కూడా విడుదల అయ్యాయి. ఒక వారంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాలపై ఓ లుక్ వేయండి.
Blood Money (బ్లడ్ మనీ )
డిసెంబర్ 23, 2021న జీ5లో బ్లడ్ మనీ సినిమా విడుదలైంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా వీక్షకులను ఆకట్టుకొంటుంది. కువైట్ జైలులో ఆపదలో ఉన్న ఇద్దరు వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నించే ఒక జర్నలిస్ట్ ఆధారంగా కథ రూపొందించారు.
మధురం (Madhuram)
సోనీ లీవ్‌లో మధురం విడుదలైంది. మళయాళ డ్రామా, రోమాన్స్ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. అనుకోకుండా ప్రేమలో పడిన జంట చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినమా డిసెంబర్ 24, 2021న ఓటీటీలోకి వచ్చింది.
మానాడు (Maanadu)
మానాడు మూవీ నవంబర్ 25, 2021న థియేటర్లో విడుదల అయ్యింది. ఈ సినిమా సోనీ లీవ్‌లో డిసెంబర్ 24, 2021న అందుబాటులోకి వచ్చింది. తమిళంలో ఈ సినమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ముఖ్యమైన పబ్లిక్ కాన్ఫరెన్స్ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అంగరక్షకుడు, పోలీసు అధికారులు టైమ్ లూప్‌లో ఇరుక్కుపోవడం అనే కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది.
పరంపర (Parampara)
డీస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు వెబ్ సిరీస్ పరంపర డిసెంబర్ 24, 2021న అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ సీరిస్ ఉండబోతుంది.
అత్రంగి రే (Atrangi Re)
డీస్నీ+హాట్‌స్టార్‌లో డిసెంబర్ 24, 2021న అత్రంగి రే విడుదలైంది. ఇది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. తమ వివాహాన్ని రద్దు చేసుకోవాలని ప్లాన్ చేసుకునే జంట చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
మిన్నల్ మురళి (Minnal Murali)
సూపర్ హీరో కథలు ప్రేక్షకులకు కొత్త కాదు కాని ప్రాంతీయ చిత్రాల్లోనూ సూపర్ హీరో కథలు కాస్త ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తాయి. పిడుగుపాటుకు గురైన తర్వాత ప్రత్యేక పవర్ సంపాధించిన టైలర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24, 2021న అందుబాటులోకి వచ్చింది.
సత్యమేవ జయతే 2 (Satyameva Jayate 2)
క్రిస్మస్ వారం OTT విడుదలయ్యే పెద్ద సినిమా సత్యమేవ జయతే 2. ఈ సినిమా 2018లో వచ్చిన విజయవంతమైన సత్యమేవ జయతే చిత్రానికి సీక్వెల్. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా డిసెంబర్ 26, 2021 నుంచి అందుబాటు ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.