Home /News /movies /

OTT MOVIES MOVIE WEEKEND EXCLUSIVE MOVIES ON OTT THIS WEEK KNOW AND WATCH EVK

OTT Movies: మూవీ వీకెండ్‌.. ఈ వారం ఓటీటీలో ప్ర‌త్యేక్ష‌మైన సినిమాలు ఇవే!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

OTT Movies 2022 | ఓటీటీల కార‌ణంగా భాషా భేదం లేకుండా ప్రేక్ష‌కులు అన్ని భాష‌ల సినిమాలు చూస్తున్నారు. కొత్త ఏడాదిలో ఈ వారం ఓటీటీలో విడుద‌లైన సినిమాల‌పై ఓ లుక్ వేయండి.

    మ‌ళ్లీ క‌రోనా కేసులు (Corona Cases) పెరుగుతుండ‌డంతో ప‌లు రాష్ట్రాలు ఆంక్ష‌లు విధించాయి. ఈ వారం అన్ని ఓటీటీల్లో కొత్త సినిమాలు ప్ర‌త్యేక్ష‌మ‌య్యాయి. కొన్ని ఇప్ప‌టికే థియేట‌ర్ల‌ల‌తో వీక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కోగా.. కొన్ని నేరుగా ఓటీటీల్లోకి వ‌చ్చాయి. ప్ర‌ముఖ ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) , అమెజాన్‌ (Amazon), ఆహా, డిస్ని+హాట్‌స్టార్ వంటి అన్ని ఓటీటీ (OTT)లు కొత్త సినిమాల‌ను అందించాయి. ఓటీటీల కార‌ణంగా భాషా భేదం లేకుండా ప్రేక్ష‌కులు అన్ని భాష‌ల సినిమాలు చూస్తున్నారు.  కొత్త ఏడాదిలో ఈ వారం ఓటీటీలో విడుద‌లైన సినిమాల‌పై ఓ లుక్ వేయండి. ఈ వీకెండ్ (Week End) ఎంజాయ్ చేయండి.

    పుష్ప‌ (అమెజాన్ ప్రైమ్‌)
    2021కి గ్రాండ్ బైబై చెప్పిన సినిమా అల్లుఅర్జున్ పుష్ప ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ జ‌న‌వ‌రి 7, 2022న వీక్ష‌ల‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో విజయ‌వంతంగా న‌డుస్తున్న ఈ సినిమా 23 రోజుల్లోనే ఓటీటీల ప్ర‌త్యేక్ష‌మైంది. అన్ని భాష‌ల్లో పాపుల‌ర్ సినిమాగా విడుద‌లైన పుష్ప‌ను ఈ వీకెండ్ ఇంట్లో కూర్చోని చూసేయండి.

    జైల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
    వసంత బాలన్ దర్శకత్వంలో జి.వి.ప్రకాష్ కుమార్ నటించిన జైల్ చిత్రం డిసెంబర్ 9, 2020న సినిమా హాళ్లలో విడుదలైంది. యాక్షన్-క్రైమ్-థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి. కొత్త‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీల‌ను చూసేవారికి మంచి అనుభూతిని ఇస్తుంది.

    OTT Movies 2021: ఈ ఏడాది ఓటీటీల్లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొన్న టాప్ 5 కాన్సెప్ట్ మూవీస్


    హంబుల్ పొలిటీషియ‌న్‌ నోగ్‌రాజ్ (Voot)
    ఇది క‌న్న‌డ వెబ్‌సిరీస్ ఎపిసోడ్‌.. మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్న ఈ వెబ్‌సిరీస్ తాజా రాజ‌కీయాల‌పై సాగే పొలిటిక‌ల్ మూవీ. సెటైరిక్ ఎపిసోడ్‌ల‌తో ఈ సినిమా సాగుతుంది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికీ పోటీపడే ఎమ్మెల్యే చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంది.

    అన్బరివు (Disney+ Hotstar)
    త‌మిళ యాక్ష‌న్ డ్రామాగా సాగే అన్బరివు జ‌నవ‌రి 7, 2022న డిస్నీ+హాట్‌స్టార్‌లో వీక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఒక వ‌ర్గం ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఓ సారి ట్రై చేయ‌వ‌చ్చు.

    టెండర్ బార్ (అమెజాన్ ప్రైమ్)
    టెండర్ బార్ సినిమా లియం మోనాహన్ స్క్రిప్ట్ ఆధారంగా, న్యూయార్క్‌లో తన బాల్యం గురించి వ్రాసిన రచయిత J.R. మోహ్రింగర్ జ్ఞాపకాల ఆధారంగా రూపొందించబడింది. జ‌న‌వ‌రి 7, 2022 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

    OTT Movies: "ఆహా"లో దుమ్మురేపిన‌ డ‌బ్ మూవీస్.. ఈ ఏడాది ఇవే టాప్‌!


    వెల్లే (అమెజాన్ ప్రైమ్ వీడియో)
    2019 తెలుగులో వ‌చ్చిన బ్రోచేవారెవ‌రురా సినిమాకు రీమెక్‌గా వెల్లే సినిమా హిందీలో రూపొందించారు. బ‌ల‌మైన స్క్రిప్ట్‌తో ఆక‌ట్టుకొన్న ఈ సినిమా చిన్న చిన్న మార్పుల‌తో హిందీలో తీశారు. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌ల‌తో రిలీజ్ అయిన మూవీ ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

    చండీగఢ్ కరే ఆషికి (నెట్‌ఫ్లిక్స్)
    డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఆయుష్మాన్ ఖురానా మరియు వాణి కపూర్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. రోమాంటిక్ డ్రామాగా సాగే ఈ సినిమా యూత్‌ను ఆక‌ట్టుకొంటుంది. ఈ సినిమా ఈ వారం నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Disney plus hotstar, Disney+ Hotstar, Netflix, Ott platform, Ott realease

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు