కరోనా (Corona) పరిస్థితుల వల్ల కొన్నాళ్లు మూత పడిన థియేటర్స్ ఇటీవల తెరుచుకున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అయితే పలు చిత్రాలు ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలయ్యాయి. అందులో కొన్ని ఈ వారం ఓటీటీ (OTT)ల ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోనే విడుదల అవుతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన సరికొత్త చిత్రం ‘పుష్ప కవిమానం’. నవంబర్ 12న విడుదలైంది. ఈ సినిమా డిసెంబర్ 10, 2021న నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది.
అమెజాన్ ప్రైమ్‌లో ఈ వారం విడుదల అయ్యే సినిమాలు
- ద ఎక్స్పాన్స్ (వెబ్ సిరీస్ సీజన్-6) డిసెంబరు10
- ఎన్కౌం టర్ (హాలీవుడ్ మూవీ) డిసెం బరు10
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల అయ్యే సినిమాలు
- ఆర్య (హిం దీ వెబ్ సిరీస్ సీజన్-2) డిసెం బరు 10
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యే సినిమాల వివరాలు..
- టైటాన్స్ (వెబ్సిరీస్ సీజన్-3) డిసెం బరు 8
- అరణ్య క్ (హిం దీ సిరీస్) డిసెం బరు 10
- ద అన్ ఫర్గివబుల్ (హాలీవుడ్) డిసెం బరు 10
జీ5లో విడుదల అయ్యే సినిమాల వివరాలు..
- కాతిల్ హసీనోం కే నామ్ (హిం దీ సిరీస్) డిసెం బరు 10
Katrina Kaif and Vicky Kaushal: నెలకు రూ.8లక్షల అద్దె.. కొత్త జంట ఎక్కడ ఉండబోతుందో తెలుసా?
OTT | ప్రస్తుతం ఓటీటీ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. డిమాండ్ నేపథ్యంలో అన్ని ఓటీటీలు ధరలను కూడా పెంచుతున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్‌షిప్ ధర కూడా భారీగా పెంచేందుకు సంస్థ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ (OTT)ల ధరలకు గురించి తెలుసుకోండి.
OTT Rates: ఓటీటీల ధరల వివరాలు..
- నెట్‌ఫ్లిక్స్ ప్రపంచలో ఎంతో ఆదరణ ఉన్న ఓటీటీ ఇది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ధరల్లో మార్పు లేకున్నా. అందుబాటులో ఉన్న ప్లాన్ వివరాలు. ఇలా ఉన్నాయి. నెలకు మొబైల్‌కి రూ.199, బేసిక్ ప్లాన్ రూ.499, స్టాండర్డ్ ప్లాన్ రూ.649, ప్రిమియం రూ.749గా ఉంది.
- అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వివరాలు చూస్తే ప్రస్తుతం యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.999. డిసెంబర్ 14 నుంచి రూ.1,499 చెల్లించాలి. యాన్యువల్ మెంబర్‌షిప్ ఏకంగా రూ.500 పెరిగింది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మంత్లీ, క్వార్టర్లీ మెంబర్‌షిప్ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మంత్లీ ప్లాన్ ధర రూ.129 కాగా డిసెంబర్ 14 నుంచి రూ.179 చెల్లించాలి. మంత్లీ ప్లాన్‌పై రూ.50 పెరిగింది.
- మరో ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ ప్రిమియం మంత్లీ రూ.299గా ఉంది. ఇయర్ ప్రిమియర్ ప్లాన్ రూ.1499గా ఉంది. అయితే వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌మాత్రం సంవత్సరానికి రూ.399గా ఉంది. ఎక్కుగా పిల్లలకు, ఫిక్షన్ మూవీస్ చూసేవారిని ఆకర్షిస్తోంది.
- ఆహా ఓటీటీ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఓటీటీకి సంబంధించి మంత్లీప్లాన్ రూ.199 ఉండగా.. ఇయర్ ప్లాన్ రూ.364 ఉంది. సోనిపిక్చర్‌కు సంబంధించిన సోనీ-ఎల్ఐవీ ఇయర్ సబ్‌స్క్రిప్షన్ రూ.999గా ఉంది. సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్స్ట్ మంత్లీ ప్లాన్ రూ.50 ఉంది. క్వార్టర్ ప్లాన్ రూ.130 ఉండగా ఇయర్ ప్లాన్ రూ.490 లతో అందుబాటులో ఉంది.
- జీ గ్రూప్‌కు చెందిన జీ5 నెలవారీ చందా రూ.99 ఉంది. మూడు నెలలకు రూ.299 ఉండగా సంవత్సరానికి రూ.499 చందాతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. మరో యూరోస్ ఇంటర్నేషనల్ ఓటీటీ ధర నెలకు రూ.49 ఉండగా, మూడు నెలలకు రూ.79 సంవత్సరానికి రూ.399 ఉంది. ప్రస్తుతం అమెజాన్ ధరల పెంపుతో అన్ని కంపెనీలు ధరలు పెంచుతాయేమోనని ప్రజలు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha app, Ott, Telugu movies, Tollywood