Home /News /movies /

OTT EFFECT ON THEATRES PRODUCERS TAKES IT AS SERIOUS SLB

OTT Effect: వెండితెర బొమ్మకు కష్టమొచ్చింది.. లబోదిబో అంటున్న నిర్మాతలు! ఏం జరుగుతోంది?

 Photo Twitter

Photo Twitter

ఇప్పటివరకు సినీ వర్కర్స్ స్ట్రైక్స్ చేయడం, తమ తమ జీతాలు పెంచాలని నిర్మాతలపై డిమాండ్స్ చేయడం లాంటివి చూసాం. కానీ ఇప్పుడు ఆ నిర్మాతలే సమ్మె బాట పట్టారు. బడా నిర్మాతలు సైతం ముందుకొచ్చి ఆగస్టు 1 నుంచి సినిమా నిర్మాణాలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. OTT ప్రభావం వల్ల చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు దృష్య్టా భవిష్యత్తులో పరిశ్రమ మనుగడకే ముప్పు వచ్చేలా ఉందని భావించి.. వెంటనే థియేటర్లను కాపాడుకునే చర్యలకు పూనుకున్నారు.

ఇంకా చదవండి ...
క్రమంగా ట్రెండ్ మారుతూ వస్తోంది. టెక్నాలజీ వేగవంతం కావడంతో మనుషుల ఆలోచనా విధానాలు కూడా మారిపోతున్నాయి. మూకీ సినిమా దగ్గర నుంచి మొదలై బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్, కలర్, గ్రాఫిక్స్, డిజిటలైజేషన్ ఇలా సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకు తగ్గట్లుగా దర్శకనిర్మాతలతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా మారుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న మరో టెక్నాలజీ OTT అనేది సినీ నిర్మాతలకు శాపంగా మారిందనే టాక్ నడుస్తోంది. నిజానికి గత కొన్నేళ్లుగా OTT వేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ కరోనాతో వాటి హవా రెట్టింపయింది. ప్రేక్షకులు పెద్ద మొత్తంలో OTT వేదికలకు అట్రాక్ట్ అయ్యారు. ఇదే ఇప్పుడు నిర్మాతలకు తల పోటుగా మారింది. ఇదే షూటింగ్ నిలిపివేతకు పునాది అయింది.

ఇప్పటివరకు సినీ వర్కర్స్ స్ట్రైక్స్ చేయడం, తమ తమ జీతాలు పెంచాలని నిర్మాతలపై డిమాండ్స్ చేయడం లాంటివి చూసాం. కానీ ఇప్పుడు ఆ నిర్మాతలే సమ్మె బాట పట్టారు. బడా నిర్మాతలు సైతం ముందుకొచ్చి ఆగస్టు 1 నుంచి సినిమా నిర్మాణాలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. OTT ప్రభావం వల్ల చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు దృష్య్టా భవిష్యత్తులో పరిశ్రమ మనుగడకే ముప్పు వచ్చేలా ఉందని భావించి.. వెంటనే థియేటర్లను కాపాడుకునే చర్యలకు పూనుకున్నారు.

నిర్మాతలంతా ఒక్కటై OTT వేదికలపై పంజా విసిరే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ పేరిట కొందరు నిర్మాతలు కొద్ది రోజులుగా సమావేశమవుతూ కీలక చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుంటూ థియేటర్ల మనుగడపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు థియేటర్‌లో రిలీజైన 10 వారాల తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలని తేల్చి చెప్పారు. అంటే క్రమంగా సగటు ప్రేక్షకుడి చూపు థియేటర్ పైనే పడాలనేది వారి ప్లాన్.

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లు విలవిల్లాడాయి. దాదాపు రెండేళ్ల పాటు థియేటర్ గేట్లకు తాళాలు పడ్డాయి. దీంతో ఆ సమయంలో ప్రేక్షకుడి వినోదానికి ఏకైన మార్గం OTT వేదిక అయింది. పలు పెద్ద సినిమాలను సైతం నేరుగా OTT లోకి వదిలారు నిర్మాతలు. దీంతో ప్రేక్షకులు ఆయా వేదికలకు కనెక్ట్ అయిపోయారు. ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమా చూసే అవకాశం ఉండటం అది కూడా తక్కువ ఖర్చుతో కావడంతో అంతా OTT వేదికలకు స్టిక్ అయిపోయారు.

ఇది గమనించిన కొందరు బడా నిర్మాతలు సొంతంగా OTT ప్లాట్‌ఫామ్స్ కూడా ఓపెన్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఫ్యూచర్ ట్రెండ్ OTT వేదికలదే అని గ్రహించిన టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్.. ఆహా (Aha) OTT వేదికను గ్రాండ్ గా లాంచ్ చేశారు. గీతా ఆర్ట్స్ లాంటి బడా నిర్మాణ సంస్థ నడిపిస్తున్న ఆయనే ఇలా OTT దిశగా అడుగులేయడం చూసి అందరికీ సీన్ అర్థమైపోయింది. ఊహించినట్లుగానే వెండితెర బొమ్మకు కష్టమొచ్చింది. ఎంతో ఖర్చు పెట్టి, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమా తీసి థియేటర్‌‌లో విడుదల చేసినా కూడా ప్రేక్షకుడి అడుగు థియేటర్ వైపు పడటం లేదు.

నాలుగు రోజులైతే OTTలో వచ్చేస్తుందిలే చూసేద్దాం అని భావిస్తున్నారు ఆడియన్స్. రీసెంట్ గా వచ్చిన బడా సినిమాలు సైతం థియేటర్లలో బోల్తా కొట్టడమే ఇందుకు నిదర్శనం. ఇది గ్రహించే నిర్మాతల మండలి దీనికి త్వరితగతిన నివారణ చర్యలు చేపట్టాలని పూనుకున్నట్లు తాజా పరిస్థితులు తెలుపుతున్నాయి. ఓ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఒకటైతే సినిమా డిజిటల్ రైట్స్ కూడా మరో ఆదాయమార్గం అయింది. ఈ మధ్యకాలంలో కొన్ని OTT వేదికలు భారీ సొమ్ము వెచ్చించి సినిమాలు కొంటున్నాయి. అలా కూడా ఆదాయం సమకూరుతోంది కదా.. మరి OTT లను కట్టడి చేయడమెందుకు అనేది కొందరి వాదన.

ఇక సగటు ప్రేక్షకుడి వైపు చూస్తే.. ఈ రోజుల్లో సినిమా థియేటర్‌లో లేదా మల్టిప్లెక్స్‌లో ఫ్యామిలీతో సినిమా చూడాలంటే దాదాపు 2 నుంచి 3 వేల రూపాయల ఖర్చు పెట్టాల్సి వస్తోంది. టికెట్ రేటుతో మొదలైన బాదుడు ఇంటర్వెల్ వచ్చే సరికి రెట్టింపవుతోంది. ఒకప్పుడు ఇంటర్వెల్ అంటే సమోసా, పాప్కార్న్ ఓ పదో ఇరవయ్యో రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు మల్టిప్లెక్స్‌ సినిమా థియేటర్లలో అవే సమోసా, పాప్కార్న్ కోసం వందలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో వినోదం సంగతేమో గానీ ఈ బాదుడు భరించలేం బాబోయ్ అనే ఆలోచనకు వచ్చాడు సగటు ప్రేక్షకుడు.

ఇది OTT హవాకు పునాది వేసిందని చెప్పుకోవచ్చు. ఓ సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో సినిమా ఎంజాయ్ చేసేయొచ్చు అని ఫిక్సవుతున్నారంతా. దీని వల్ల థియేటర్ వ్యవస్థకు బీటలు వారుతున్నాయి. సినిమా నిర్మాతల్లో, హీరోల్లో చాలామంది పెద్ద పెద్ద థియేటర్స్, మల్టీప్లెక్సులు ఉన్నాయి. అందుకే ఇలా OTT వేదికలను కట్టడి చేసి సొమ్ము చేసుకోవాలని చేసుకుంటున్నారా? అనేది సగటు ప్రేక్షకుడి మదిలో మాట.

డిజిటల్ బిజినెస్ కంటే థియేట్రికల్ బిజినెస్‌కే నిర్మాతలు ఓటు వేస్తున్నారా? థియేటర్ల నుంచే కోట్లు కుమ్మరించుకోవాలనే ఆలోచనలో పడ్డారా? అనేది ఇంకొందరి ప్రశ్న. ఇప్పుడు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలు నిర్మాతలతో పాటు ప్రేక్షకుడికి ఉపయోగకరమేనా లేక వినోదం పేరిట గుదిబండ మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనేది ఇంకొందరి వాదన. అయితే సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం సగటు ప్రేక్షకుడికి ఓ వరం లాంటిదని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌, కాస్ట్‌ కటింగ్‌, ప్రొడక్షన్‌ ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో పాటు OTT కట్టడిని ప్రధానంగా తీసుకున్నారు నిర్మాతలు. అందుకే ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇలా షూటింగ్స్ నిలుపుదలతో సినీ కార్మికుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే కరోనా కారణంగా పూట గడవక గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సినీ కార్మికులపై ఇప్పుడు నిర్మాతలే లేనిపోని కష్టాలు తెస్తున్నారా? ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌ ఆపేయడం అనేది సినీ కార్మికుల పొట్ట కొట్టే అంశమే అనేది మరికొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం అటు OTT వేదికల హవాకు కొంతమేర బ్రేక్స్ వేస్తుందని చెప్పుకోవచ్చు కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం కాస్త చేదుగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో.. చూడాలి మరి సినిమా, థియేటర్స్ మనుగడ కోసం నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయనేది!.
Published by:Sunil Boddula
First published:

Tags: Tollywood, Tollywood Cinema, Tollywood Producers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు