• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • OSCARS 2021 PRIYANKA CHOPRA NICK JONAS RELEASED 2021 OSCAR NOMINATIONS LIST TA

Oscars 2021: ఆస్కార్ 2021 నామినేషన్స్ జాబితా విడుదల చేసిన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్..

Oscars 2021: ఆస్కార్ 2021 నామినేషన్స్ జాబితా విడుదల చేసిన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్..

ఆస్కార్ నామినేషన్ లిస్ట్ విడుదల చేసిన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ (Instagram/Photo)

Oscars 2021: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కలిసి ఆస్కార్ 2021 నామినేషన్స్ లిస్ట్‌ను విడుదల చేసారు.

 • Share this:
  Oscars 2021: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటుంటారు. సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐతే.. ఈ యేడాది (2021)లో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేసి ఏప్రిల్‌కు పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 25న అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికన్ టైమింగ్ ప్రకారం జరగనుంది. సోమవారం సాయంత్రం ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ నామినేషన్ విడుదల చేసారు.

  ఆస్కార్ నామినేషన్స్ లిస్టులో డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ‘మాంక్’ చిత్రం 10 విభాగాల్లో నామినేట్ అయింది. ఈ సారి ఝావో ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి ఆసియా సంతతి మహిళ. ఇక మన దేశం తరుపున ఆస్కార్‌ వెళ్లిన తమిళ కథానాయకుడు సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ ఫైనల్ లిస్టులో చోటు దక్కకపోవడం బాధాకరం అనే చెప్పాలి.

  ఆస్కార్ నామినేషన్ లిస్టులో ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..

  ఉత్తమ చిత్రం విభాగంలో 

  ది ఫాదర్

  జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య

  మాంక్ నోమాడ్ ల్యాండ్

  మినారి  ప్రామిసింగ్ యంగ్ ఉమన్

  సౌండ్ ఆఫ్ మెటల్

  ద ట్రయల్ ఆఫ్ షికాగో 7

  బెస్ట్ డైరెక్టర్ (ఉత్తమ దర్శకుడు)

  క్లో ఝావో (నోమాడ్ ల్యాండ్)

  లీ ఇసాక్ చుంగ్ (మినారి)

  డేవిడ్ ఫించర్ (మాంక్)

  ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)

  థామస్ వింటర్ బెర్గ్ (ఎనదర్ రౌండ్)

  బెస్ట్ యాక్ట్రెస్ (ఉత్తమ నటి)

  కేరీ ముల్లిగాన్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)

  ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (నోమాడ్ ల్యాండ్)

  వయోలా డేవిస్ (మా రెయినీస్ బ్లాక్ బాటమ్)

  వెనెస్సా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఏ ఉమన్)

  ఆండ్రా డే (ద యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే)

  బెస్ట్ యాక్టర్ (ఉత్తమ నటుడు )

  గ్యారీ ఓల్డ్ మన్ (మాంక్)

  స్టీవెన్ యేన్ (మినారి)

  చాడ్విక్ బోస్ మన్ ( మా రెయినీస్ బ్లాక్ బాటమ్)

  రిజ్ అహ్మద్ (సౌండ్ ఆఫ్ మెటల్)

  ఆంథోనీ హాప్కిన్స్ (ది ఫాదర్)  బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫీమేల్ (ఉత్తమ సహాయనటి)

  అమందా సేఫ్రీడ్ (మాంక్)

  గ్లెన్ క్లోజ్ (హిల్ బిల్లీ ఎలెజీ)

  ఒలీవియో కోల్మన్ (ది ఫాదర్)

  యు జంగ్ యోన్ (మినారి)

  మరియా బకలోవా (బోరాట్ సబ్ సీక్వెంట్ మూవీ ఫిల్మ్)

  బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మేల్ (ఉత్తమ సహాయనటుడు)

  పాల్ రేసీ (సౌండ్ ఆఫ్ మెటల్)

  లాకీత్ స్టాన్ ఫీల్డ్ (జూడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య)

  సాషా బరోన్ కోహెన్ (ద ట్రయల్ ఆఫ్ షికాగో 7)

  లెస్లీ ఓడోమ్ జూనియర్ (వన్ నైట్ ఇన్ మయామీ)

  డేనియల్ కలూయా (జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా)

  ఇవి కాకుండా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కాస్టూమ్ డిజైన్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ యానిమేషన్ మూవీ, బెస్ట్ సౌండ్, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ వంటి విభాగాల్లో నామినేషన్స్ ప్రకటించారు.  ఆస్కార్ అవార్డు ప్రారంభమైన 92 యేళ్లలో ఈ వేడుక ఇలా వాయిదా పడటం ఇదే మొదటిసారి. 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని 8 వారాల పాటు వాయిదా వేసారు. ఆస్కార్ వేడుకల చరిత్రలో ఈ వేడుక వాయిదా వేయడం నాల్గోసారి. 1938లో లాస్ ఏంజెల్స్‌లో వరదలు ముంచెత్తినపుడు ఓసారి వాయిదా పడింది. ఆ తర్వాత 1968లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ హత్య జరిగిపుడు రెండు రోజులు, 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై హత్య యత్నం జరిగినపుడు ఈ వేడుకలను వాయిదా వేశారు. గడిచిన 40 ఏళ్లలో మాత్రం ఆస్కార్ వేడుకలు వాయిదా పడడం ఇదే మొదటిసారి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  అగ్ర కథనాలు