• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • OSCARS 2021 MALAYALAM FILM JALLIKATTU MOVIE OUT FROM OSCAR RACE FOR BEST INTERNATIONAL FILM CATEGORY TA

Oscars 2021: ఆస్కార్ బరిలో మరోసారి భారతీయ సినిమాకు భంగపాటు.. రేసులో నుంచి తప్పుకున్న ’జల్లికట్టు’ మూవీ.

ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న జల్లికట్టు మూవీ (Twitter/Photo)

Oscars 2021: మన దేశం తరఫున 93వ ఆస్కార్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘జల్లికట్టు’ అనే మలయాళ సినిమాను ఎంట్రీగా పంపించింది ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా. తాజాగా ఈ సినిమా

  • Share this:
    Oscars 2021: మన దేశం తరఫున 93వ ఆస్కార్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘జల్లికట్టు’ అనే మలయాళ సినిమాను ఎంట్రీగా పంపించింది ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా. దీనికి సంబందించిన ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. 2021 ఆస్కార్ బరిలోకి దిగేందకు అన్ని భారతీయ భాషల్లో కలిపి మొత్తం 27 సినిమాలు పోటీపడగా చివరకు ‘జల్లికట్టు’ ఎంపికైంది. తాజాగా ఈ సినిమా విదేశీ చిత్రాల కేటగిరిలో ఎంపిక కాలేకపోవడం భారతీయులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి.

    ఈ చిత్రాన్ని లిజో జోస్ పెలిస్సెరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, చెంబన్‌ వినోద్‌ జోస్, శాంతి బాలచంద్రన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. జల్లికట్టు సినిమా విషయానికి వస్తే.. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న ఓ దున్నపోతు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతటి వినాశనం చేసిందనేది కథ. ఇక్కడ ఈ సినిమాలో విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ సినిమా మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఎక్కడా ఉపయోగించలేదట.సినిమా టీమ్ యానిమేట్రానిక్స్‌ ద్వారా ఓ దున్న బొమ్మలను తయారు చేశారట. ఇలా ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షల ఖర్చు అయిందట.


    ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీగా పోటీబడ్డ సినిమాల విషయానికి వస్తే.. అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’తో పాటు హన్సల్‌ మెహతా ‘ఛాలెంజ్‌’, ‘ది డిసైపుల్‌’, ‘మూతాన్‌’, ‘కామ్యాబ్‌’, ‘షికారా’, ‘బిట్టర్‌ స్వీట్‌’ వంటి సినిమాలు ఉన్నాయి. మరోవైపు విద్యాబాలన్ నటించిన ‘నట్‌కట్’ మూవీ షార్ట్ ఫిల్మ్ లిస్టులో నామినేట్ అయింది. మరోవైపు ‘బిట్టు’ అనే మూవీ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ లిస్టులో ఎంపికైంది. ఇక మన దేశం నుంచి ఇప్పటి వరకు  ఆస్కార్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్ దక్కించుకున్నాయి. కానీ ఈ సినిమాల్లో వేటికి ఆస్కార్ అవార్డులు రాలేదు. ఈ అవార్డు వేడుకలను  ఈ యేడాది కరోనా కారణంగా ఫిబ్రవరిలో కాకుండా..  ఏప్రిల్ 25న లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: