టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ అని ట్యాగ్ వేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన కథలు, కథనాలు, సినిమాను తెరకెక్కించే విధానంతో ప్రేక్షకులు ఆయన్ని క్రియేటివ్ డైరెక్టర్ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన కృష్ణవంశీ తదనాంతరం ప్లాపులను చవి చూశారు. ఒకానొక దశలో సినిమాలకు దూరంగా ఉండిపోయారు కూడా. చాలా రోజులు కామ్‌గా ఉన్న కృష్ణవంశీ ఇప్పుడు 'రంగమార్తాండ' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా కృష్ణవంశీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణవంశీ డైరెక్షన్లో రూపొందుతోన్న చిత్రం 'అన్నం'. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో అరిటాక్.. అందులో అన్నం.. చిమ్మిన రక్తం, కొడవలి, తాళిబొట్టు ఉన్నాయి.
ఇవన్నీ చూస్తుంటే..దేశంలో రైతుల పరిస్థితిపై కృష్ణవంశీ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను ఎవరితో చేస్తాడనే దానిపై ఇంకా కృష్ణవంశీకి ఇవ్వలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ పనిచేయబోతున్నాడట. ప్రస్తుతం కృష్ణవంశీ దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నాడట. అంతా ఓకే అయితే ఎ.ఆర్.రెహమాన్ ట్రాక్‌లోకి రావడం పక్కా అని అంటున్నారు. ఇదే కనుక జరిగితే కృష్ణవంశీ, ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది.
అలాగే సూపర్ పోలీస్, నాని, కొమురం పులి చిత్రాల తర్వాత ఎ.ఆర్.రెహమాన్ డైరెక్టర్ తెలుగు సినిమాకు పనిచేయలేదు. ఇప్పుడు ఓకే అన్నాడంటే ఎ.ఆర్.రెహమాన్‌ను మళ్లీ తెలుగులో తీసుకొచ్చిన క్రెడిట్ కృష్ణవంశీకే దక్కుతుంది. కాంట్రవర్సీ సినిమాలు చేయడం కృష్ణవంశీకి కొత్తేం కాదు. మరి ఈసారి అన్నంతో కృష్ణవంశీ ఎలాంటి కాంట్రవర్సీకి తెర తీస్తాడో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishna vamsi