Oscar Awards 2021: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటుంటారు. సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐతే.. ఈ యేడాది (2021)లో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేసి ఏప్రిల్‌కు పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆస్కార్ అవార్డు ప్రారంభమైన 92 యేళ్లలో ఈ వేడుక ఇలా వాయిదా పడటం నాల్గోసారి. 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని 8 వారాల పాటు వాయిదా వేసారు. 1938లో లాస్ ఏంజెల్స్‌లో వరదలు ముంచెత్తినపుడు ఓసారి వాయిదా పడింది. ఆ తర్వాత 1968లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ హత్య జరిగిపుడు రెండు రోజులు, 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై హత్య యత్నం జరిగినపుడు ఈ వేడుకలను వాయిదా వేశారు.
గడిచిన 40 ఏళ్లలో మాత్రం ఆస్కార్ వేడుకలు వాయిదా పడడం ఇదే మొదటిసారి. కాసేపటి క్రితమే అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికన్ టైమింగ్ ప్రకారం ఎప్పటిలా కాకుండా సాదాసీదాగా ప్రారంభమైంది. ప్రేక్షకులు లేకుండా కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక ఉత్తమ నటుడుగా ఆంథోని హాప్కిన్స్ ఎంపికయ్యారు. గ్యారీ ఓల్డ్ మన్, స్టీవెన్ యేన్, చాడ్విక్ బోస్మన్, రిజ్ అహ్మద్‌లతో పోటీ పడి ఈ అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ నోమాడ్ ల్యాండ్ సినిమాలో నటనకు ఎంపికైంది. ఈమె కూడా కేరీ ముల్లిగాన్, వయోలా డేవిస్, వెనెస్సా కిర్బీ, ఆండ్రా డే వంటి పోటీ పడి ఈ అవార్డు కైవసం చేసుకుంది. కోవిడ్ మహామ్మారి కారణంగా ఈ వేడుకలను తొలిసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు.
ఉత్తమ నటుడు.. ఆంథోని హాప్కిన్స్ ( ది ఫాదర్)
ఉత్తమ నటి.. ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్ ( నో మ్యాడ్ ల్యాండ్)
ఉత్తమ చిత్రం: నో మ్యాడ్ లాండ్
ఉత్తమ దర్శకురాలు.. క్లీవీ చావన్
ఉత్తమ సంగీతం.. సౌండ్ ఆఫ్ మెటల్
ఉత్తమ సహాయ నటుడు.. డానియెల్ కలువోయో’
ఉత్తమ సహాయ నటి.. యున్ యా జంగ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ.. ఎరిక్ (మ్యాంక్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే.. ఎమరాల్డ్ ఫె్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే.. క్రిష్టోఫర్ హామ్టన్, ప్లొరియన్ జెల్లర్ ( ది ఫాదర్)
బెస్ట్ ఇంటర్ననేషన్ ఫీచర్ ఫిల్మ్.. అనదర్ రౌండ్ (డెన్మార్క్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్.. సెర్హియోలోఫెజ్, మియానీల్,జిమికా విల్సన్ ( మా రైనీస్ బ్లాక్ బాటమ్)
బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్.. అన్‌రాత్ ‘ ( మా రైనీస్ బ్లాక్ బాటమ్)
బెస్ట్ లైవ్ యాక్షన్ ఫిల్మ్.. మార్టిన్ డెస్మండ్ రాయ్ (టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్.. మైకల్ గ్రోవియర్ (ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : పీట్ డాక్టర్, దానా మరీ (సోల్)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్.. ఆంథోని (కలెక్టివ్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్.. పిపా, జేమ్స్ రీడ్, క్రేగ్ ఫాస్టర్ (మై ఆక్టోపస్ టీజర్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. ఆండ్రూ జాక్సన్, డేవిడ్ లీ (టెనెట్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్.. డోనాల్డ్ బర్ట్ (మ్యాంక్)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hollywood, Oscar Awards 2021