OSCAR AWARDS 2021 SURIYA SUDHA KONGARA SOORARAI POTTRU ELIGIBLE FOR BEST PICTURE NOMINATIONS MNJ
Suriya Soorarai Pottru: ఆస్కార్ బరిలో 'ఆకాశం నీ హద్దురా'.. ఆ సినిమాలతో పోటీ పడబోతున్న సూర్య మూవీ
Soorarai Pottru- Oscar: గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో సూర్య సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా) ఒకటి. నవంబర్ 12న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
Soorarai Pottru- Oscar: గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో సూర్య సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా) ఒకటి. నవంబర్ 12న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
Soorarai Pottru- Oscar: గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో సూర్య సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా) ఒకటి. నవంబర్ 12న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌లతో డీలా పడ్డ సూర్యకు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కథ మొదలు ప్రధాన పాత్రాధారుల నటన, స్క్రీన్ ప్లే, సుధా కొంకర దర్శకత్వం, జీవీ ప్రకాష్ సంగీతం, నిర్మాణ విలువలు అన్నీ ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. ఇక సర్వత్రా ప్రశంసలను సంపాదించుకున్న ఈ మూవీ ఆ మధ్యన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు బరిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. జనరల్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్‌తో పాటు పలు కేటగిరిల్లో ఈ చిత్రం పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా బెస్ట్ పిక్చర్ నామినేషన్‌కి సూరారై పొట్రు నామినేట్ అయ్యింది. మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు కూడా నిలిచింది.
దీనికి సంబంధించిన లిస్ట్‌ను ఆస్కార్ అవకాడమీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో మార్చి 5 నుంచి ఈ మూవీకి ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు సూర్య, అపర్ణ బాలమురళీ ఉత్తమ నటీ నటులుగా ఆస్కార్ బరిలో నిలిచారు. ఇక ఈ విషయం తెలిసిన సూర్య ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ఈ చిత్రమైనా ఆస్కార్ గెలవాలని భారతీయులు ఎదురుచూస్తున్నారు.
కాగా తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన కెప్టెన్ గోపినాథ్ జీవితాంశాలతో సూరారై పొట్రు తెరకెక్కింది. ఇందులో సూర్య సరసన అపర్ణ బాలమురళీ నటించగా.. మోహన్ బాబు, ఊర్వశి, పరేష్ రావల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ ఈ మూవీకి సంగీతం అందించారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.