• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • OSCAR AWARDS 2021 BEST ACTOR ANTONY HOPKINS AND BEST ACTRESS TO FRANCES MCDORMAND TA

Oscar Awards 2021: ఆస్కార్ 2021 ఉత్తమ నటీనటులుగా ఆంథోని హాప్కిన్స్, ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్...

ఆస్కార్ విజేతలు (Twitter/Photos)

Oscar Awards 2021:  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది.

  • Share this:
    Oscar Awards 2021:  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడుగా ఆంథోని హాప్కిన్స్ ఎంపికయ్యారు. గ్యారీ ఓల్డ్ మన్, స్టీవెన్ యేన్, చాడ్విక్ బోస్‌మన్, రిజ్ అహ్మద్‌లతో పోటీ పడి ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. మరోవైపు ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ నోమాడ్ ల్యాండ్ సినిమాలో నటనకు ఎంపికైంది. ఈమె కూడా కేరీ ముల్లిగాన్, వయోలా డేవిస్, వెనెస్సా కిర్బీ, ఆండ్రా డే వంటి పోటీ పడి ఈ అవార్డు గెలుచుకున్దినారు.  కోవిడ్ మహామ్మారి కారణంగా ఈ వేడుకలను తొలిసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు.

    సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐతే.. ఈ యేడాది (2021)లో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేసి ఏప్రిల్‌కు పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆస్కార్ అవార్డు ప్రారంభమైన 92 యేళ్లలో ఈ వేడుక ఇలా వాయిదా పడటం నాల్గోసారి. 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని 8 వారాల పాటు వాయిదా వేసారు. 1938లో లాస్ ఏంజెల్స్‌లో వరదలు ముంచెత్తినపుడు ఓసారి వాయిదా పడింది.

    ఆ తర్వాత 1968లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ హత్య జరిగిపుడు రెండు రోజులు, 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై హత్య యత్నం జరిగినపుడు ఈ వేడుకలను వాయిదా వేశారు.గడిచిన 40 ఏళ్లలో మాత్రం ఆస్కార్ వేడుకలు వాయిదా పడడం ఇదే మొదటిసారి. కాసేపటి క్రితమే అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికన్ టైమింగ్ ప్రకారం ఎప్పటిలా కాకుండా సాదాసీదాగా ప్రారంభమైంది. ప్రేక్షకులు లేకుండా కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: