Oscar : ఆస్కార్ బరిలో మన దేశం తరుపున షార్ట్ లిస్ట్‌లో సర్ధార్ ఉధమ్, విద్యా బాలన్ షేర్ని..

ఆస్కార్ 2022లో ఫైనల్ లిస్టులో ‘సర్ధార్ ఉధమ్’, ‘షేర్ని’ మూవీలు (File/Photos)

Oscar - Sardar Udham - Sherni : ఆస్కార్ .. ప్రపంచ సినీ ప్రేమికులు జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు అందుకోవాలని కోరుకుంటారు. ఈ అవార్డు కోసం నటనలో ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తారు. వచ్చే యేడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం నుంచి ‘షేర్ని’, ‘సర్ధార్ ఉధమ్’ సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.

  • Share this:
    Oscar - Sardar Udham - Sherni : ఆస్కార్ .. ప్రపంచ సినీ ప్రేమికులు జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు అందుకోవాలని కోరుకుంటారు. ఈ అవార్డు కోసం నటనలో ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తారు. ఒక్కసారి ఆస్కార్ (అకాడమీ) అవార్డు రాగానే ఆ కష్టాన్ని మరిచిపోతారు. తాజాగా 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కెేటగిరిలో పోటీ పడేందకు మన భారత దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆస్కార్ లిస్ట్‌లో కేంద్రం 15 మంది సభ్యులతో ఓ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన దేశం నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసారట. వీటిలో విద్యాబాలన్ (Vidya Balan) ముఖ్యపాత్రలో నటించిన ‘షేర్నీ’ (Sherni) మూవీతో పాటు.. యూరీ .. ది సర్జికల్ స్ట్రైక్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ పాత్రలో నటించిన ‘సర్ధార్ ఉధమ్’ (Sardar Udham) షార్ట్ లిస్ట్ అయ్యాయట.

    ఈ రెండు సినిమాలు థియేటర్స్‌లో విడుదల కాకుండా.. నేరుగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోవడం విశేషం. విద్యా బాలన్ షేర్ని విషయానికొస్తే.. ఈ సినిమా అమిత్ వి మసూర్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మనిషి, జంతువుకు రెండు ప్రకృతికి పర్యావరాణానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా.. మనిషి మనుగడ ప్రమాదంలో పడుతోందనే కాన్సెప్ట్‌తో ీ సినిమాను తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమాకు IMDB 6.8/10 రేటింగ్ ఇచ్చింది.

    67th National Film Awards: ధనుశ్, మనోజ్ బాజ్‌పేయ్ సహా ఇప్పటి వరకు జాతీయ అవార్డు అందుకున్న నటులు వీళ్లే..


    మరోవైపు సూజిత్ సర్కార్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ .. టైటిల్ రోల్ ప్లే చేసిన మూవీ ‘సర్ధార్ ఉధమ్’. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విప్లవకారుడు సర్ధార్ ఉధమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సర్ధార్ ఉధమ్ సింగ్ పాత్రలో విక్కీ కౌశల్ అదరగొట్టారు. 1919 జలియన్ వాలా బాగ్ హత్యకాండాకు ప్రతీకారం 21 యేళ్ల తర్వాత  తీర్చుకుంటారు. ఈ దారుణ మారణకాండాకు బాధ్యుడైన జనరల్ ఓ డయ్యర్‌ను లండన్‌లో ఓ వేడుకలో హత్య చేసి భారతీయుల హత్యకు  ప్రతీకారం తీర్చుకుంటారు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

    NTR-NBK: తండ్రి ఎన్టీఆర్ ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో బాలకృష్ణ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..


    అంతేకాదు IMDB ఈ సినిమాకు రికార్డు స్థాయిలో 9.2/10 రేటింగ్ ఇచ్చింది. ఈ రేంజ్‌లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ ఈ మధ్యకాలంలో ఏది లేదు. ఈ మూవీలో సర్ధార్ ఉధమ్ సింగ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాతో మరోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం పక్కా చెబుతున్నారు సినీ విమర్శకులు.

    67th National Film Awards: కంగనా సహా ఇప్పటి వరకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న నటీమణులు వీళ్లే..


    ఆస్కార్ రేసులో ‘షేర్నీ’ ‘సర్ధార్ ఉధమ్’లతో పాటు తమిళ సినిమా ’మండేలా’, మలయాళం మూవీ ‘నయాట్టు’ పోటీ పడుతున్నాయి. నెక్ట్స్ ఇయర్ 2022 మార్చిలో విజేతలను ప్రకటించి అవార్డులను ఇవ్వనున్నారు. మన దేశం నుంచి అధికారిక ఎంట్రీ కోసం 14 సినిమాలు పోటీలో ఉన్నాయి. 15 మంది జ్యూరీ సభ్యులు పశ్చిమ బంగ రాజధాని కోల్‌కతాలో బిజోలి సినిమా థియేటర్‌లో  ఈ మూవీస్ చూసి షార్ట్ లిస్టు రెడీ చేస్తున్నారు.

    Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..


    ఇప్పటి వరకు ఆస్కార్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్ దక్కించుకున్నాయి. కానీ ఈ సినిమాల్లో వేటికి ఆస్కార్ అవార్డులు రాలేదు. ఈ సారైనా మన  భారతీయ చిత్రం ఏదైనా విదేశీ కేటగిరిలో అవార్డు సాధిస్తుందో లేదో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: