OSCAR 2022 SURIYA JAI BHIM AND MOHANLAL MARAKKAR ELIGIBLE TO ENTRY INTO FOREIGN FILM CATEGORY TA
Oscar : మన దేశం తరుపున ఆస్కార్ బరిలో సూర్య ‘జై భీమ్’.. మోహన్‌లాల్ ‘మరక్కార్’..
ఆస్కార్ షార్ట్ లిస్టులో సూర్య ‘జై భీమ్’, మోహన్‌లాల్ ‘మరక్కార్’ మూవీలు (Twitter/Photo)
Jai Bhim - Marakkar Entry into Oscar 2022 | ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆస్కార్ ప్రకటించిన షార్ట్ లిస్టులో మన దేశం తరుపున సూర్య ‘జై భీమ్’తో పాటు మోహన్‌లాల్ ‘మరక్కార్’ మూవీలు చోటు దక్కించుకున్నాయి.
Jai Bhim - Marakkar Entry into Oscar 2022 | ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐతే.. గతేడాది (2021)లో ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేసి ఏప్రిల్‌లో అవార్డులు ప్రధానం చేశారు. ఈ అవార్డు కోసం నటనలో ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తారు. ఒక్కసారి ఆస్కార్ (అకాడమీ) అవార్డు రాగానే ఆ కష్టాన్ని మరిచిపోతారు.
తాజాగా 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కెేటగిరిలో పోటీ పడేందకు మన భారత దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడ్డాయి. ఆస్కార్ లిస్ట్‌లో కేంద్రం 15 మంది సభ్యులతో ఓ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన దేశం నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసి ఫైనల్‌గా ‘కూజంగల్’ మూవీని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. కానీ ఈ సినిమాను ఆస్కార్ షార్ట్‌లో స్థానం సంపాదించలేకపోయింది.
ఇక 94వ ఆస్కార్ (అకాడమీ) అవార్డుల బరిలో నిలిచే 276 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో భారత దేశం నుంచి బెస్ట్ ఫారెన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘మరక్కార్’తో పాటు సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సినిమాలు చోటు దక్కించుకున్నట్టు ఆస్కార్ అవార్డుల కమిటీ అధికారికంగా ప్రకటించింది.
గతేడాది సూర్య నటించిన ‘సూరారై పొట్రు’(ఆకాశం నీ హద్దురా) ఆస్కార్ రేసులో పోటీ పడింది. ఇపుడు ఈయన ముఖ్యపాత్రలో నటించిన ‘జై భీమ్’ వరుసగా రెండు యేడాది ఆస్కార్ రేసులో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో సూర్య అమాయక గిరిజనులు తరుపున పోరాడే లాయర్ చంద్రు పాత్రలో నటించి మెప్పించారు. గతేడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇదే కోవలో మన దేశం తరుపున మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘మరక్కార్’ కూడా నిలిచింది. మలయాళ చిత్ర సీమలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచినా.. జ్యూరీ సభ్యులను ఆకట్టుకుంది. కుంజాలి మరక్కార్ -4 జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రియదర్శన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు జాతీయ ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డులు గెలుచుకొని అందరి మన్ననలు అందుకుంది. గతేడాది చివర్లో థియేటర్స్‌లో విడుదలైంది. తాజాగా ఆస్కార్ బరిలో నిలిచింది.
ఆస్కార్ షార్ట్ లిస్టులో ఎంపికైన ఈ చిత్రాల్లోంచి తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు. ఇక ఆస్కార్ షార్ట్ లిస్టులో ఎంపికైన చిత్రాల్లో ‘స్బైడర్ మ్యాన్’, నో వే హోమ్, బీయింగ్ ది రికార్డస్’, ‘స్పెన్సర్’ ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ వంటి పలు చిత్రాలున్నాయి. ఫైనల్‌గా ఏ సినిమా తుది లిస్టులో ఉంటుందో చూడాలి. ఇక మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగుంది. ఈ కార్యక్రమాన్ని దాదాపు 200 దేశాల్లో లైవ్‌లో ప్రసారం చేయనున్నారు.
ఇప్పటి వరకు ఆస్కార్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్ దక్కించుకున్నాయి. కానీ ఈ సినిమాల్లో వేటికి ఆస్కార్ అవార్డులు రాలేదు. ఈ సారైనా మన భారతీయ చిత్రం ఏదైనా విదేశీ కేటగిరిలో అవార్డు సాధించాలని కోరుకుందాం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.