Oscar 2022 : ఆస్కార్ బరిలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ‘Koozhangal’ మూవీ..

ఆస్కార్ బరిలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ‘కూజంగల్’ మూవీ (Twitter/Photo)

Oscar - Koozhangal : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఈ యేడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రాల కేటగిరిలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ‘కూజంగల్’ మూవీని ఎంపిక్ చేశారు.

 • Share this:
  Oscar - Koozhangal : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు.  సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐతే.. ఈ యేడాది (2021)లో ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేసి ఏప్రిల్‌లో అవార్డులు ప్రధానం చేశారు.  ఈ అవార్డు కోసం నటనలో ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తారు. ఒక్కసారి ఆస్కార్ (అకాడమీ) అవార్డు రాగానే ఆ కష్టాన్ని మరిచిపోతారు.

  తాజాగా 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కెేటగిరిలో పోటీ పడేందకు మన భారత దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడ్డాయి. ఆస్కార్ లిస్ట్‌లో కేంద్రం 15 మంది సభ్యులతో ఓ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన దేశం నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసి ఫైనల్‌గా ‘కూజంగల్’ మూవీని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ‘కూజంగల్’ మూవీని నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రఖ్యాత ప్రెస్టీజియస్ టైగర్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అంతేకాదు 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.

  MLA Roja Husband RK Selvamani Birthday Celebrations : ఎమ్మెల్యే రోజా భర్త దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. ఫోటోస్ వైరల్..


  రియలిస్టిక్ డ్రామా చెల్లపండి మరియు కరుత్తాదైయాన్ ముఖ్యపాత్రల్లో పోషించారు. పి.ఎస్. సంతోష్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.  ఆస్కార్ బరిలో ఈ సినిమాను అధికారికంగా ఎంపికైన నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత విఘ్నేష్ శివన్ ఆస్కార్‌కు రెండడుగుల దూరం ఉందంటూ  తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకన్నారు.  ఇక IMDBలో ఈ సినిమాను 7.1/10 రేటింగ్ సంపాదించింది. గంట 15 నిమిషాల నిడివితో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఆస్కార్ బరిలో మన దేశం తరుపున విద్యాబాలన్ (Vidya Balan) ముఖ్యపాత్రలో నటించిన ‘షేర్నీ’ (Sherni) మూవీతో పాటు.. యూరీ .. ది సర్జికల్ స్ట్రైక్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ పాత్రలో నటించిన ‘సర్ధార్ ఉధమ్’ (Sardar Udham) సినిమాలను కూడా షార్ట్ లిస్ట్ చేశారు.

  HBD Rebel Star Prabhas : రెబల్ స్టార్‌ టూ ప్యాన్ ఇండియా స్టార్‌గా ఆకాశమే హద్దుగా ప్రభాస్ సినీ ప్రస్థానం..


  ఈ రెండు సినిమాలు థియేటర్స్‌లో విడుదల కాకుండా.. నేరుగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోవడం విశేషం. విద్యా బాలన్ షేర్ని విషయానికొస్తే.. ఈ సినిమా అమిత్ వి మసూర్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మనిషి, జంతువుకు రెండు ప్రకృతికి పర్యావరాణానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా.. మనిషి మనుగడ ప్రమాదంలో పడుతోందనే కాన్సెప్ట్‌తో ీ సినిమాను తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమాకు IMDB 6.8/10 రేటింగ్ ఇచ్చింది.

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్పనున్నారా.. ?

  మరోవైపు సూజిత్ సర్కార్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ .. టైటిల్ రోల్ ప్లే చేసిన మూవీ ‘సర్ధార్ ఉధమ్’. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విప్లవకారుడు సర్ధార్ ఉధమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సర్ధార్ ఉధమ్ సింగ్ పాత్రలో విక్కీ కౌశల్ అదరగొట్టారు. 1919 జలియన్ వాలా బాగ్ హత్యకాండాకు ప్రతీకారం 21 యేళ్ల తర్వాత  తీర్చుకుంటారు. ఈ దారుణ మారణకాండకు బాధ్యుడైన జనరల్ ఓ డయ్యర్‌ను లండన్‌లో ఓ వేడుకలో హత్య చేసి భారతీయుల హత్యకు  ప్రతీకారం తీర్చుకుంటారనేదే ఈ సినిమా స్టోరీ . ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

  NTR-NBK: తండ్రి ఎన్టీఆర్ ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో బాలకృష్ణ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..


  అంతేకాదు IMDB ఈ సినిమాకు రికార్డు స్థాయిలో 9.2/10 రేటింగ్ ఇచ్చింది. ఈ రేంజ్‌లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ ఈ మధ్యకాలంలో ఏది లేదు. ఈ మూవీలో సర్ధార్ ఉధమ్ సింగ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాతో మరోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం పక్కా చెబుతున్నారు సినీ విమర్శకులు.

  67th National Film Awards: కంగనా సహా ఇప్పటి వరకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న నటీమణులు వీళ్లే..


  ఆస్కార్ రేసులో ‘షేర్నీ’ ‘సర్ధార్ ఉధమ్’లతో పాటు తమిళ సినిమా ’మండేలా’, మలయాళం మూవీ ‘నయాట్టు’ పోటీ పడ్డాయి. ఫైనల్‌గా ‘కూజంగల్’ మూవీ మన దేశం తరుపున ఆస్కార్ బరిలో షార్ట్ లిస్ట్ అయింది. ఈ అవార్డు వేడుకలను 2022 మార్చిలో ఇవ్వనున్నారు. మన దేశం నుంచి అధికారిక ఎంట్రీ కోసం 14 సినిమాలు పోటీ పడ్డాయి. 15 మంది జ్యూరీ సభ్యులు పశ్చిమ బంగ రాజధాని కోల్‌కతాలో బిజోలి సినిమా థియేటర్‌లో  ఈ మూవీస్ చూసి షార్ట్ లిస్టు రెడీ చేసి చివరకు అందరు కలిసి ‘కూజంగల్’ మూవీని మన దేశం తరుపున ఆస్కార్‌కు నామినేట్ చేశారు.

  Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..


  ఇప్పటి వరకు ఆస్కార్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్ దక్కించుకున్నాయి. కానీ ఈ సినిమాల్లో వేటికి ఆస్కార్ అవార్డులు రాలేదు. ఈ సారైనా మన  భారతీయ చిత్రం ఏదైనా విదేశీ కేటగిరిలో ‘కూజంగల్’  అవార్డు సాధించాలని కోరుకుందాం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: