ప్రియాప్రకాశ్ వారియర్...! ఈ తరం యువతకి ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ.‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలో మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుగొట్టి, చేతులతో గన్ను పేల్చి యూత్ హార్ట్స్‌ను కొల్లగొట్టింది.
ఓవర్ నైట్ సెన్సేషన్ అయింది. నెట్లో సెన్సేషన్ అయినంతగా ఈమె యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘ఒరు అదార్ లవ్’ ప్రేక్షకులన మెప్పించడంలో విఫలమైంది. తెలుగులో ‘లవర్స్ డే’ గా విడుదలైన ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది.
ప్రస్తుతం ఈ భామ హిందీలో యాక్ట్ చేసిన ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా ఈ భామ పింక్ ఫ్రాక్‌లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ప్రియా వారియర్‌ను చూస్తుంటే చూపు పక్కకు తిప్పుకోలేము.
View this post on Instagram
ప్రస్తుతం ఈ భామ తెలుగులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లోతెరెకెక్కే మూవీలో కథానాయికగా ఈమె పేరునే పరిశీలిస్తున్నారు.
మరోవైపు నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా ప్రియా వారియర్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఒకవైపు సోషల్ మీడియా, మరోవైపు క్రేజీ ప్రాజెక్టులతో ప్రియా వారియర్ దూకుడు మాత్రం మాములుగా లేదు.
ఇవి కూడా చదవండి
బాహుబలికి RRR ఏమాత్రం తీసిపోదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
బాలకృష్ణ మొదలు పెట్టాడు.. వర్మ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు..
జబర్దస్త్‌లో హిట్.. సినిమాల్లో ఫ్లాప్.. హైపర్ ఆది వింతగాధ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Malluwood, Nani, Priya Prakash Varrier, Telugu Cinema, Tollywood