హోమ్ /వార్తలు /సినిమా /

Vishwak Sen: ఓరి దేవుడా.. అట్రాక్ట్ చేస్తున్న మెలోడి సాంగ్

Vishwak Sen: ఓరి దేవుడా.. అట్రాక్ట్ చేస్తున్న మెలోడి సాంగ్

Ori Devuda (Photo Twitter)

Ori Devuda (Photo Twitter)

Ori Devuda Song: విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ వదిలారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ (Mithila), ఆశా భట్ (Asha Bhatt) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’ (Ori Devuda). ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh) ఇందులో దేవుడు పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ విషయం తెలిసి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి రెట్టింపయింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని చూస్తోంది ప్రేక్షక లోకం.

భారీ లెవెల్ లో తెరకెక్కించిన ఈ ఓరి దేవుడా చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్త‌య్యింది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఓ వైపు సినిమా పనులు పూర్తి చేస్తూనే మరోవైపు ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ వదులుతున్నారు మేకర్స్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ ‘ఔననవా..’ అంటూ సాగే మెలోడి సాంగ్ విడుదల చేసింది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) రాసిన లిరిక్స్ మనసుకు హత్తుకుంటున్నాయి. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాశారు. విజ‌య్ ఈ చిత్రాన్ని ఎడిట‌ర్‌గా, విదు అయ్య‌న్న సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

''ఏమ‌ని అనాల‌ని తోచ‌ని క్ష‌ణాలివి.. ఏ మ‌లుపు ఎదురయ్యే ప‌య‌న‌మిదా.. ఆమ‌ని నువ్వేన‌ని నీ జ‌త చేరాల‌ని.. ఏ త‌ల‌పో మొద‌ల‌య్యే మౌన‌మిదా.. ఔన‌న‌వా ఔన‌న‌వా..'' అంటూ ప్రేమికుడు త‌న ప్రేయ‌సికి మ‌న‌సులోని మాట‌ల‌ను పాట రూపంలో చెబితే ఎలా ఉంటుంది.. మ‌న‌సుకు హ‌త్తుకుంటుంది. ఇంత‌కీ ఆ ప్రేమికుడు ఎవ‌రో కాదు.. అశోక్ సెల్వ‌న్‌. ఇంత‌కీ ఆయ‌న త‌న ప్రేమ‌ను ఎవ‌రికీ చెప్పాడో తెలియాలంటే ‘ఓరి దేవుడా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత ప్ర‌సాద్ వి.పొట్లూరి.

Published by:Sunil Boddula
First published:

Tags: Tollywood, Tollywood actor, Vishwak Sen

ఉత్తమ కథలు