Home /News /movies /

OPERATION GOLD FISH TELUGU MOVIE BASED ON KASHMIRS ARTICLE 370 BS

ఆర్టికల్ 370పై తొలి సినిమా.. ఆది హీరోగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్..

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా

Article 370 | ఆర్టికల్ 370పై అన్నింటికన్నా ముందు తెలుగులోనే సినిమా విడుదల కాబోతోంది. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయికిరణ్ అడివి ఆర్టికల్ 370 అంశాన్ని స్పృశిస్తూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌` సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇంకా చదవండి ...
జమ్మూకశ్మీర్, దేశ భక్తి, సైనికుల నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ హిట్ కొట్టేశాయి. అందుకు ఉరి సినిమానే ఉదాహారణ. ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో దానిపైనా సినిమా చేసేందుకు దర్శకులు సిద్ధమవుతుంటే.. సినిమా టైటిల్‌ను దక్కించుకునేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆర్టికల్ 370, ఆర్టికల్ 370 ఎత్తివేత, ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370 తొలగింపు, ఆర్టికల్ 35ఏ రద్దు, కశ్మీర్ మే తిరంగా, కశ్మీర్ హామారా హే లాంటి సినిమా టైటిల్స్‌పై రిజిస్ట్రేషన్ల కసరత్తు జరుగుతోందని సమాచారం. ఇప్పుడు ఆర్టికల్ 370కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ నేపథ్యంలో అన్నింటికన్నా ముందు తెలుగులోనే సినిమా విడుదల కాబోతోంది.వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయికిరణ్ అడివి ఆర్టికల్ 370 అంశాన్ని స్పృశిస్తూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌` సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, మనోజ్ నందం, అబ్బూరి రవి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఆది ఈ చిత్రంలో ఎన్‌ఎస్‌జీ కమెండోగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథను సిద్ధం చేయడానికి తనకు మూడేళ్లు పట్టిందని, కశ్మీరీ పండిట్ల కుటుంబాలను కలిసి పరిస్థితులను తెలుసుకున్నానని దర్శకుడు చెప్పాడు. 370, 35A ఆర్టికల్స్‌ను మోదీ సర్కారు రద్దు చేసినప్పుడు సంతోషపడ్డానని తెలిపాడు. కాగా, ఆర్టికల్ 370పై తొలిసారి ఓ తెలుగు సినిమా రానుండటం విశేషం.
Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Aadi Saikumar, Article 370, Kashmir, Telugu Movie, Telugu Movie News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు