news18-telugu
Updated: October 1, 2019, 3:51 PM IST
‘సైరా’ షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)
చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు టాలీవుడ్లో హీరోలుగా రాణించారు. అందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వంటి వారు సాధించలేనిది రామ్ చరణ్ సాధించాడు. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలా మంది హీరోలకు సొంత ప్రొడక్షన్స్ హౌస్‌లు ఉన్నాయి. ఈ విభాగంలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఎన్.ఏ.టి-రామకృష్ణ, ఏఎన్నాఆర్‌కు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు ఫ్యామిలీకి సంబంధించిన సురేష్ ప్రొడక్షన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నయి. కృష్ణ ఫ్యామిలీ నుంచి పద్మాలయా స్టూడియోతో పాటు పలు ప్రొడక్షన్ హౌస్‌లు ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన అంజనా ప్రొడక్షన్స్‌ను చిరంజీవి వాళ్లు పెద్ద తమ్ముడు నాగబాబుతో స్టార్ట్ చేయించాడు. ఈ బ్యానర్లో చిరంజీవి యాక్ట్ చేపిన రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, స్టాలిన్ వంటి సినిమాలతో తమ్ముడి నాగబాబుకి హిట్ సిన్మా ఇయ్యలేకపోయాడు చిరు.ఒక్క బావగారు బాగున్నారా…తప్ప అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో మరో హిట్టు సినిమాను నిర్మించలేక పోయాడు నాగబాబు. అటు పవన్ కళ్యాన్ తో ఈ మెగాబ్రదర్ నిర్మించిన‘‘గుడుంబా శంకర్’’ కూడా అట్టర్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైంది.

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్
ఆ తర్వాత రామ్ చరణ్‌తో తీసిన ఆరెంజ్ కూడా ఈ రకంగానే డిజాస్టర్ లిస్టులో చేరింది. ఈ మధ్యలో నాగబాబు హీరోగా నటిస్తూ...నిర్మించిన ‘కౌరవుడు’ కూడా ఫ్లాప్ లిస్టులోనే చేరింది. అటు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన పేరుతో పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ బ్యానర్లో ఫస్ట్ మూవీగా ‘సర్థార్ గబ్బర్ సింగ్’ సినిమా నిర్మించాడు. ఈ చిత్రం కూడా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నితిన్ హీరోగా ‘ఛల్ మోహన్ రంగ’ కూడా ఫ్లాప్ లిస్టులో చేరింది.

పవన్ కళ్యాణ్, నాగబాబు
చిరంజీవి బామ్మర్థి అల్లు అరవింద్ బ్యానరైన గీతా ఆర్ట్స్ మెగా ఫ్యామిలీకి మంచిగనే కలిశొచ్చింది. కానీ తమ్ముడు నాగబాబు ప్రారంభించిన అంజనా ప్రొడక్షన్ బ్యానర్ మాత్రం మెగా ఫ్యామిలీకి అస్సలు కలిసి రాలేదు.

చిరంజీవి అల్లు అరవింద్
మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ..తన తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ మూవీ కోసం కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్ స్టార్ట్ చేసాడు. ఈ బ్యానర్లో మొదటి సినిమాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమిళంలో విజయ్ హీరోగా హిట్టైయిన ‘కత్తి’ సినిమాను ‘ఖైదీ నెంబర్ 150’గా రీమేక్ చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మెగా ఫ్యామిలీకి ప్రొడక్షన్ కలిసి రాదన్న అందరి వాదలను పటా పంచలు చేస్తూ రామ్ చరణ్ నిర్మాతగా సక్సెస్ సాధించాడు.

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)
ఇపుడు మరోసారి చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తెలుగుతో పాటు కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో రామ్ చరణ్ నిర్మాతగా మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 1, 2019, 3:47 PM IST