అసలైన మెగాస్టార్‌ను అప్పుడే చుశాను: రామ్ చరణ్‌

రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా తన తండ్రి చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు.

news18-telugu
Updated: September 8, 2019, 7:59 PM IST
అసలైన మెగాస్టార్‌ను అప్పుడే చుశాను: రామ్ చరణ్‌
Instagram/alwaysramcharan
  • Share this:
చిరంజీవి... ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న పిరియాడిక్ చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. చిరంజీవి ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సైరాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. అది అలా ఉంటే.. రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌లో తన తండ్రి చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు. రామ్ చరణ్ తన పోస్ట్‌లో రాస్తూ.. తన తండ్రి చిరంజీవికి నిర్మాతగా మారిన తర్వాత అసలైన మెగాస్టార్‌ను కలిశానని రాసుకున్నారు రామ్ చరణ్. ఆయన ఆదివారం సోషల్‌మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో సైరా షూటింగ్ సంబందించిన వర్కింగ్ స్టిల్ షేర్‌ చేశారు. ఆ ఫోటోలో చరణ్.. తన తండ్రి వైపు చూస్తూ.. గడ్డం పట్టుకుని కనిపించారు. 

View this post on Instagram
 

Dad’s transformation for #SYERAA is an experience in itself. Only after becoming his Producer did I meet the Real Megastar! #SyeRaa #SyeRaaNarasimhaReddy #SyeRaaOnOct2nd


A post shared by Ram Charan (@alwaysramcharan) on

ఆయన తన పోస్ట్‌లో రాస్తూ... సైరా సినిమా కోసం  నాన్న మారిన తీరు ఓ గొప్ప అనుభవం అంటూ.. ఆయన సినిమాకు నిర్మాతగా మారిన తర్వాతే నేను అసలైన మెగాస్టార్‌ను కలిశానన్నారు.  ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో మెగా అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. సైరాలో చిరంజీవితో పాటు మిగితా ముఖ్య పాత్రల్లో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. అక్టోబరు 2న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు దర్శక నిర్మాతలు.
First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>