హోమ్ /వార్తలు /సినిమా /

Butta Bomma: 'బుట్ట బొమ్మ‌'కు ఏడాది.. ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్-పూజా హెగ్డే పాట

Butta Bomma: 'బుట్ట బొమ్మ‌'కు ఏడాది.. ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్-పూజా హెగ్డే పాట

2020: అల వైకుంఠపురములో

2020: అల వైకుంఠపురములో

ఎక్కువ‌గా హిట్ అయిన పాట‌ల్లో బుట్ట బొమ్మ(Butta Bomma) మొద‌టి స్థానంలో ఉంటుంది. ఈ పాటకు బ‌న్నీ, పూజా క్యూట్ స్టెప్పులు వేయ‌గా.. పాట‌తో పాటు వీడియో కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది

Butta Bomma: క‌రోనా రాక‌ముందు ఈ ఏడాది థియేట‌ర్‌లో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రాల్లో అల్లు అర్జున్ అల వైకుంఠ‌పుర‌ములో ఒక‌టి. త్రివిక్ర‌మ్, బ‌న్నీ కాంబినేష‌న్లో మూడో చిత్రంగా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తాను చాటి.. నాన్ బాహుబ‌లి రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా హిట్ అవ్వ‌డంలో క‌థ‌తో పాటు.. ప్ర‌ధాన పాత్ర పోషించిన వాటిలో పాట‌లు ఒక‌టి. ఈ మూవీకి థ‌మ‌న్‌ సంగీతం అందించ‌గా.. ప్ర‌తి పాట సంగీత ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఈ మూవీలోని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న, రాములో రాములా, బుట్ట బొమ్మ పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. కాగా వీటిలోనూ ఎక్కువ‌గా హిట్ అయిన పాట‌ల్లో బుట్ట బొమ్మ మొద‌టి స్థానంలో ఉంటుంది. ఈ పాటకు బ‌న్నీ, పూజా క్యూట్ స్టెప్పులు వేయ‌గా.. పాట‌తో పాటు వీడియో కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో ఇటు లిరిక‌ల్, అటు డ్యాన్స్ వీడియోకు 250 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ రాగా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

ఇక అప్ప‌ట్లో భార‌త్‌లో టిక్‌టాక్ అందుబాటులో ఉండ‌గా.. ఇక్క‌డి వారే కాకుండా ఉత్త‌రాది వారు కూడా ఈ పాట‌కు స్టెప్పులు వేశారు. శిల్పా శెట్టి వంటి ఎంతోమంది ప్ర‌ముఖులు ఈ పాట‌కు స్టెప్పులు వేశారు. అంతేనా ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌కి అయితే ఈ పాట‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంది. ఇటీవ‌ల దుబాయ్‌లో జ‌రిగిన‌ ఐపీఎల్‌లోనూ ప‌లుమార్లు బుట్ట‌బొమ్మ స్టెప్‌ను వేశాడు.

ఇటీవల ఈ పాట త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన పాట అని కూడా వార్నర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కాగా ఈ పాట వ‌చ్చి ఈ రోజుకు ఏడాది అవుతోంది. బాలీవుడ్ సింగ‌ర్ అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట రిలిక‌ల్ వీడియో గ‌తేడాది ఇదే రోజున విడుద‌ల అయ్యింది. దీంతో ఈ పాటను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో One Year for Butta Bomma అన్న‌ది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

First published:

Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Pooja Hegde, Tollywood

ఉత్తమ కథలు