హైపర్ ఆది పై టీవీ రిపోర్టర్ ఫైర్.. రోజా చూస్తుండగానే..

రోజా, హైపర్ ఆది (Roja Hyper Aadi)

హైపర్ ఆది ..ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా హైపర్ ఆదిపై ఒక రిపోర్టర్ ఒక ప్రోగ్రామ్ సాక్షిగా కడిగిపారేసాడు.

  • Share this:
    హైపర్ ఆది ..ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఈ ప్రోగ్రామ్‌లో తనదైన కామెడీ పంచ్‌లతో అవతలి వాళ్లు పంక్చర్ అయ్యేలా ఉంటాయి హైపర్ ఆది టైమింగ్. జబర్ధస్త్  ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన హైపర్ ఆది సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా హైపర్ ఆదిపై జాఫర్ అనే రిపోర్టర్ ఫైర్ అయ్యాడు. టీవీ 9 చానెల్‌ ద్వారా పాపులర్ అయిన జాఫర్.. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్ చేసాడు. తాజాగా జాఫర్.. హైపర్ ఆదిని సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ను తన స్కిట్‌లో భాగంగా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడు. అప్పట్లో కత్తి మహేశ్ పై చేసిన కామెంట్స్ పై జాఫర్.. ఆదిని నిగ్గదీసాడు. అలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడానికి నీకు సిగ్గుందా అని నిలదీశాడు. అది కూడా సిని నటి ఎమ్మెల్యే రోజా పక్కన ఉండగానే ఇదంత జరిగింది.

    అసలు ఇది ఎక్కడ జరిగిందా అని ఆశ్యర్యపోకండి. న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్‌లో భాగంగా జబర్ధస్త్‌కు చెందిన మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్లు ఈటీవీలో ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే’ అనే ప్రోగ్రామ్‌కు కండెక్ట్ చేశారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 రాత్రి 9.30 గంటలకు ప్రసారం కాబోతుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన రెండు ప్రోమోలను విడుదల చేశారు. తాజాగా మూడో ప్రోమోను ఒదిలారు. ఈ ప్రోమో కామెడీగా కాకుండా కొంచెం సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగానే జాఫర్ ఎంట్రీ ఇచ్చి.. హైపర్ ఆదిని తనదైన శైలి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత జాఫర్  ప్రశ్నలకు హైపర్ ఆది తనదైన శైలిలో ఏ రకంగా వివరణ ఇచ్చాడనేది తెలియాలంటే డిసెంబర్ 31 వరకు వెయిట్ చేయక తప్పదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: