హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు కోసం విలన్‌గా స్టార్ హీరో.. ‘సర్కారు వారి పాట’ కోసం భారీ ప్లాన్..

మహేష్ బాబు కోసం విలన్‌గా స్టార్ హీరో.. ‘సర్కారు వారి పాట’ కోసం భారీ ప్లాన్..

అమెరికాలో సింగిల్ షెడ్యూల్‌తో మెజారిటీ షూట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు పరశురామ్. అమెరికా షెడ్యూల్ తర్వాత ఇండియాలో కేవలం 30 శాతం మాత్రమే మిగిలి ఉంటుందని.. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే పేపర్ వర్క్ పూర్తి అయిపోయింది.. వీసాల కోసం వేచి చూస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరు తెలిపారు.

అమెరికాలో సింగిల్ షెడ్యూల్‌తో మెజారిటీ షూట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు పరశురామ్. అమెరికా షెడ్యూల్ తర్వాత ఇండియాలో కేవలం 30 శాతం మాత్రమే మిగిలి ఉంటుందని.. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే పేపర్ వర్క్ పూర్తి అయిపోయింది.. వీసాల కోసం వేచి చూస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరు తెలిపారు.

Mahesh Babu Sarkaru Vaari Pata |మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఢీ కొట్టే విలన్ పాత్రలో స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం.

    ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు  సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరుశురామ్ ఈ సినిమాను తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీ చేస్తాడనకుంటే.. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనల్ ఉన్నాడట. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రకు సినిమాలో హీరోగా సమానమైన ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ సినిమాలో విలన్ కోసం మరో స్టార్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చింది. ఇప్పటికే  కన్నడ హీరో ఉపేంద్ర ఈ సినిమాలో విలన్‌ కోసం సంప్రదించారు. కానీ ఉపేంద్ర తనకున్న కమిట్‌మెంట్స్‌తో ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించలేనని చెప్పాడట. దాంతో ఈ చిత్ర యూనిట్ సుదీప్‌ను సంప్రదించారట.

    one of the star hero play crucial role in mahesh babu sarkar vaari pata movie,Mahesh babu,Mahesh babu Sarkaru vvari pata,mahesh babu sudeep,mahesh babu sudeep sarkaru vaari pata,sudeep,sudeep twitter,sarkaru vaari pata movie poster,sarkaru vaari pata pan india movie,mahesh babu sarkaru vaari paat first pan india movie,mahesh babu twitter,mahesh babu ear ring,mahesh babu one rupee coin tattoo on neck,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata,mahesh babu,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata teaser,sarkaru vaari paata,sarkar vaari pata new movie for mahesh babu,mahesh babu sarkar vaari paata movie teaser,sarkar vaari paata,maheshbabu sarkar vari paata,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata mahesh babu,mahesh babu sarkar vaari paata,sarkaru vaari paata mahesh babu new movie,mahesh babu sarkaari vaari paata,sarkar vari paata,sarkar vari pata motion teaser,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,మహేష్ బాబు సర్కారు వారి పాట,తెలుగు సినిమా,మహేష్ బాబు పరశురామ్,ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,సర్కార్ వారి పాట మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు సినిమాలో సుదీప్,మహేష్ బాబు కోసం విలన్‌గా సుదీప్,విలన్‌గా మారుతున్న సుదీప్,మహేష్ బాబు సుదీప్ సర్కారు వారి పాట
    మహేష్ బాబుకు విలన్‌గా సుదీప్ (Twitter/Photo)

    ఇక సుదీప్ కూడా ఈ సినిమా స్టోరీ విని బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇక మహేష్ బాబు సినిమా కోసం అడిగిన డేట్స్ ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాలకు క్లాష్ అవుతున్న .. వేరే సినిమాలకు ఇచ్చిన డేట్స్‌ను ఈ సినిమా కోసం ఇచ్చాడట. కేవలం ముప్పై రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఆ లోపు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయాలనే కండిషన్ పెట్టాడట. దీనిని చిత్ర యూనిట్ కూడా ఓకెే  చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేసేందకు సుదీప్‌కు భారీ మొత్తంలో పారితోషకాన్ని ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. తెలుగులో ‘ఈగ’, ‘రక్త చరిత్ర’, ‘బాహుబలి’ వంటి సినిమాల తర్వాత సుదీప్ యాక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. మొత్తంగా సర్కారు వారి పాటలో సుదీప్.. మహేష్ బాబుకు ఏ రకంగా ఢీ కొడతాడో చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Sarkaru vaari pata, Sudeep, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు