ఆ హీరోయిన్ కోసం ఆస్తులు అమ్ముకున్న నిర్మాత..

అవును సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి హీరోయిన్స్ కోసం నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే...

news18-telugu
Updated: January 5, 2020, 5:15 PM IST
ఆ హీరోయిన్ కోసం ఆస్తులు అమ్ముకున్న నిర్మాత..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
అవును సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి హీరోయిన్స్ కోసం నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే... అతనో బడా నిర్మాత. తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి సంపాదించిన ఆస్తుల్లో ఎక్కువ మటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు సదరు హీరోగా నటించే చిత్రం కోసం బడా కథానాయికలనే తీసుకొచ్చాడు ఈ ప్రొడ్యూసర్. వాళ్లను ఒప్పించడానికి ఆ నిర్మాత తనకున్న ఆస్తుల్లో కొన్నింటికి సదరు హీరోయిన్స్ పేరిట రాసిచ్చినట్టు అప్పట్లో చాలా మంది చెవులు కొరుక్కున్నారు. అంతేకాదు ఈ కథానాయకుడు ఏ సినిమా చేసినా.. కథ ఉన్న లేకపోయినా.. పెద్ద హీరోయిన్ ఐతే కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పటికీ సదరు హీరో ఏ సినిమా తీసినా..  వెనకాలే తండ్రే ఫైనాన్షియర్‌గా ఉండి అంతా  కథ నడిపిస్తాడనే టాక్ ఉంది. ఇక సదరు హీరో చేసిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు ఫెయిల్యూర్స్‌గానే నిలిచాయి. మొత్తానికి ఆ నిర్మాత కొడుకును హీరోగా నిలబెట్టడానికి ఉన్న ఆస్తులను హారతి కర్పూరంలా కరిగిస్తున్న ఈ కథానాయకుడు మాత్రం హీరోగా సత్తా చూపెట్టలేకపోవడం విశేషం.

First published: January 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు