ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా అత్యవసర సేవలు తప్పించి మిగిలిన వాళ్లు ఇంటిపట్టునే ఉన్నారు. ఈ లాక్డౌన్లో సినీ సెలబ్రిటీలు తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్‌ను ఓ నెటిజన్ను ఓ వింత ప్రశ్న వేసారు. సర్.. మీరెప్పుడైనా ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలనకున్నురా ? అని ఆసక్తికర ప్రశ్న వేసాడు.అరే పొద్దుపొద్దున ఇలాంటి ప్రశ్న ఏంటి ? కాస్త పాజిటివ్‌గా ఆలోచించి మాట్లాడు అని కాస్త నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇక బిగ్‌బి సరదగా మాట్లాడిన తీరు అభిమానులతో పాటు నెటిజన్లను నవ్వించింది.
లాక్డౌన్ నేపథ్యంలో అందరిలాగే అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో పాటు తనకు సంబంధించిన పాత ఫోటోలను అభిమానులకు షేర్ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ తన తొలి ఫోటోషూట్ స్టిల్ పంచుకున్నారు. 1969లో బిగ్‌బీ తన ఫస్ట్ మూవీ ‘సాత్ హిందూస్థానీ’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన తర్వాత ఫిల్మ్ మ్యాగజైన్ నా కోసం తీసుకున్న ఫస్ట్ ఫోటో షూట్. ఆ మ్యాగజైన్ పేరు ‘స్టార్ అండ్ స్టైల్’. ఫిల్మ్‌ఫేర్‌తో నడుస్తున్న గొప్ప మ్యాగజైన్ ఇది. షూట్లో కాస్త ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. నిజానికి ఆ ప్రాజెక్ట్‌లో స్టార్ అండ్ స్టైల్ రెండు లేవన్నారు. ఇక అమితాబ్ బచ్చన్ ప్రధాన మంత్రి కాలేకపోయినా.. ఆయనకు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ క్లాస్ మేట్ కావడం విశేషం. అప్పట్లో ఆయన ఒకసారి అలహాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Coronavirus, Covid-19, Tollywood