హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: జైల్లో మోనితకు మరో సపోర్ట్.. మళ్ళీ అవమానల్లో నలిగిపోతున్న వంటలక్క కుటుంబం!

Karthika Deepam: జైల్లో మోనితకు మరో సపోర్ట్.. మళ్ళీ అవమానల్లో నలిగిపోతున్న వంటలక్క కుటుంబం!

karthika deepam

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సీరియల్ రేటింగ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. ఇక కార్తీక్, దీపలు పిల్లలని స్కూల్ దగ్గర వదిలేసి ఫీజు కట్టమన్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సీరియల్ రేటింగ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. ఇక కార్తీక్, దీపలు పిల్లలని స్కూల్ దగ్గర వదిలేసి ఫీజు కట్టమన్న సంగతి తెలిసిందే. ఇక పిల్లలు స్కూల్ గురించి మాట్లాడుకుంటూ వస్తుండగా తన ఫ్రెండ్ తమ దగ్గరికి వచ్చి పలకరించగా తమ డాడీ కార్తీక్ జైలుకు వెళ్లి వచ్చాడని.. ఎవరినో మర్డర్ చేశారని తెలిసింది అనేసరికి వెంటనే సౌర్య, హిమ అలా ఏం లేదు అంటూ కోపంగా మాట్లాడుతారు. మా డాడీ చాలా మంచోడు అంటూ ఆ అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు.మీ నాన్నకి, మోనిత ఆంటీకి ఏదో ఉందంట కదా.. మీకు తెలియదా మీ ఇంట్లో వాళ్ళు మీకు అబద్ధాలు చెప్పారు అంటూ ఆ అమ్మాయి నవ్వుతుంది.

మా అమ్మ నాన్న మీ నాన్న గురించి చాలా మాట్లాడుకున్నారు అంటూ.. మీ డాడీ మోనిత ఆంటీ ని చీట్ చేసాడంట.. మీ ఇంట్లో వాళ్ళు మీకు అబద్ధం చెప్పారని మళ్ళీ మళ్ళీ చెబుతూ వాళ్లను బాధ పెడుతుంది. ఇక మోనిత జైలులో సుకన్య అనే కానిస్టేబుల్ కు కడుపు నొప్పి రావడంతో ఆమెకు టాబ్లెట్ ఇచ్చి నయం చేస్తుంది. దీంతో ఆమె మోనితను పొగుడుతుంది. ఇక ఆమె మాటలు బట్టి ఆమె మోనితకు ఏదో ఒక సహాయం చేసేలా కనిపిస్తుంది. కార్తీక్ తన హాస్పిటల్ కి వెళ్ళగా అందరు డాక్టర్లు కార్తీక్ కు స్వాగతం పలుకుతారు. మోనిత గురించి డాక్టర్స్ అందరూ ప్రశ్నలు వేస్తుండగా ఒకేసారి వారందరిపై ఫైర్ అవుతాడు కార్తీక్.పిల్లలు ఇద్దరు ఆ విషయాన్ని తలుచుకొని బాధపడుతుంటారు. హిమ మాత్రం బాగా ఏడుస్తుంది.

ఇది కూడా చదవండి:తెలివిలేని వంటలక్క, డాక్టర్ బాబు.. అదే సైకో ప్లాన్స్‌తో మోనిత ఎత్తుగడలు

డాడీ బ్యాడ్ బాయ్ కాదు కదా తప్పు చేయడు కదా అని హిమ సౌర్య తో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మరోవైపు డాక్టర్ భారతి కార్తీక్ తో మాట్లాడుతుంది. మోనిత రిలేషన్ కట్ చేయకుండా ఇలా చేసింది అంటూ తన బిడ్డకు నువ్వే తండ్రి అంటూ మాట్లాడగా కార్తీక్ మాత్రం అంత తెలిసి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావ్ ఏంటి అని ఆమెను ప్రశ్నిస్తాడు.ఇక జైల్లో మోనిత ఊచలు లెక్కపెట్టుకుంటూ.. కార్తీక్ తో పెళ్లి గురించి ఊహలు ఊహించుకుంటూ మురిసిపోతుంది. అంతలోనే సుకన్య వచ్చి తన సంతోషానికి కారణం ఏంటని తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఇక సుకన్య ను ఒక హెల్ప్ చేయమని అడగగా.. వెంటనే సుకన్య నా ఫ్యాన్ మేడం మీరు అంటూ నా వల్ల అయితే కచ్చితంగా చేస్తానని ధైర్యం ఇస్తుంది.

ఇది కూడా చదవండి:అమెరికాకు పయనమైన వంటలక్క కుటుంబం.. మోనిత తిరిగిచ్చేలోపు మనం వెళ్లిపోవాలంటూ?

తన ఫ్రెండ్ ని పిలిపించమని కోరగా సుకన్య కచ్చితంగా పిలుస్తాను అంటూ చెబుతుంది. వారణాసి కారులో దీప ప్రయాణిస్తుండగా వారణాసి ఏడ్చినట్టు కనిపిస్తాడు. ఇక దీప అడగటంతో కంట్లో దుమ్ము పడిందని అంటాడు. దీప కారు ఆపించి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించగా.. మా బస్తీలో డాక్టర్ బాబు గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు అంటూ ఏడుస్తాడు. నోటికి వచ్చిన మాటలు అంటున్నారని ఏడుస్తాడు. అవన్ని పట్టించుకోకు అంటూ దీప ధైర్యం ఇస్తుంది. కానీ తను కూడా మోనిత మాటలు కార్తీక్ కు వస్తున్న అవమానాలు తలుచుకుని బాధపడుతుంది. కార్తీక్ కూడా భారతి అన్న మాటలు తలుచుకుంటాడు. మరోవైపు హిమ ఏడుస్తుంటే సౌర్య ఓదారుస్తుంది. అంతలోనే కార్తీక్ వస్తాడు. తరువాయి భాగంలో పిల్లలు తమ ఫ్రెండ్ అన్న మాటలు మొత్తం ఇంట్లో వాళ్లకు చెప్పుకుంటూ ఏడుస్తారు.

First published:

Tags: Archana ananth, Doctor babu, Hima, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Sourya, Sukhanya, Vantalakka, Varanasi

ఉత్తమ కథలు