సింగర్‌కు చుక్కలు చూపించిన 5 స్టార్ హోటల్.. 3 గుడ్లకు రూ.1672 బిల్లు..

5 నక్షత్రలా హోటల్ అంటే ఏమిటో కానీ.. ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు నిజంగానే  ఈ హోటల్ తన బిల్లుతో నిజంగానే చుక్కలు చూపెట్టింది.  వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: November 15, 2019, 1:58 PM IST
సింగర్‌కు చుక్కలు చూపించిన 5 స్టార్ హోటల్..  3 గుడ్లకు రూ.1672 బిల్లు..
సింగర్‌కు బిల్లుతో చుక్కలు చూపించిన 5 స్టార్ హోటల్ (Twitter/Photo)
  • Share this:
5 నక్షత్రలా హోటల్ అంటే ఏమిటో కానీ.. ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు నిజంగానే  ఈ హోటల్ తన బిల్లుతో నిజంగానే చుక్కలు చూపెట్టింది.  వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న హయత్ రీజెన్సీ హోటల్‌లో బస చేసాడు. ఈ గురువారం ఆయన భోజనంతో పాటు మూడు ఎగ్స్‌ను తెమ్మని హోటల్ వాళ్లకు చెప్పాడు. అయితే.. అసలు కంటే కొసరు ముద్దని ఈ మూడు ఎగ్స్‌కు ఏనకంగా రూ.1672 బిల్లు వేశారు. దాన్ని చూసి మ్యూజిక్ డైెరెక్టర్ అవాక్కయ్యాడు. వెంటనే సదరు మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని ఫోటో తీసి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. శేఖర్ పోస్ట్ చేసిన బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ ఆ హోటల్ యాజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. మూడు బాయిల్డ్ ఎగ్స్‌కు రూ 1350 రూపాయలు, సర్వీస్ చార్జీ కింత రూ.67.50 రూపాయిలు, సీజీఎస్టీ 9 శాతం కింద 127.58 రూపాయిలు, ఎస్‌జీఎస్టీ కింద మరో రూ.127.58 కలిపి రూ.1672 బిల్లు వేయడం ఎంత వరకు న్యాయం అంటూ అందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఒక హోటల్‌లో అరటి పండ్ల విషయమై ఇలాంటి రగడే నడిచింది. ఐనా హోటల్ యాజమాన్యాలలో ఎలాంటి చలనం లేదు. ఇక సదరు మ్యూజిక్ డైరెక్టర్ కు బిల్లు పంపిన యాజమాన్యం దీనిపై ఎలాంటి ఉలుకు పలుకు లేదు.First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు