ONE AND ONLY MAHESH BABU SARILERU NEEKEVVARU IN PONGAL RACE NO ONE TELUGU HEROES LIKE CHIRANJEEVI BALAKRISHNA PRABHAS NOT RACE IN 2020 SANKRANTHI SEASON EXPECT RAJINIKANTH TA
‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మహేష్ బాబుకు లైన్ క్లియర్ చేసిన చిరు,బాలయ్య,ప్రభాస్..
మహేష్ బాబు,చిరంజీవి,బాలకృష్ణ,ప్రభాస్
మన దగ్గర సంక్రాంతి సందడి అంటే ఎలా ఉంటుందే తెలిసిందే. ఒకటి నాలుగు సినిమాలు పొంగల్ పోరులో ఉండాల్సిందే. అలా లేకపోతే అది సంక్రాంతి పండగనే కానే కాదు.కానీ వచ్చే సంక్రాంతి మాత్రం ఒకటికి నాలుగు సినిమాలు బరిలో ఉండే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. దీంతోె 2020 సంక్రాంతికి మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీక్కవెరు’ సినిమా సింగిల్‌గా థియేటర్లో వచ్చే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే..
మన దగ్గర సంక్రాంతి సందడి అంటే ఎలా ఉంటుందే తెలిసిందే. ఒకటి నాలుగు సినిమాలు పొంగల్ పోరులో ఉండాల్సిందే. అలా లేకపోతే అది సంక్రాంతి పండగనే కానే కాదు.కానీ వచ్చే సంక్రాంతి మాత్రం ఒకటికి నాలుగు సినిమాలు బరిలో ఉండే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఇప్పటికే బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ స్క్రిప్ట్‌ను పూర్తి పక్కనపెట్టి ఆ ప్రాజెక్ట్‌ను ఆపేసినట్టు సమాచారం. మరోవైపు చిరంజీవి కూడా ‘సైరా నరసింహారెడ్డి’తో సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా అక్టోబర్ 2న దసరా సెలవుల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది కుదరకపోతే.. డిసెంబర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాను ముందుగా సంక్రాంతి అనుకున్న ఈ సినిమాను మార్చి చివరి వారానికి పోెస్ట్ పోన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ఒక్క తమిళం నుంచి రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దర్బార్’ మాత్రం సంక్రాంతి రేసులో బరిలో ఉంది.
సరిలేరు నీకెవ్వరు టైటిల్
రజినీకాంత్ విషయానికొస్తే..గత కొన్నేళ్లుగా తెలుగులోఆయన సినిమాల మార్కెట్ దారుణంగా పడిపోయింది. తలైవా నటించిన చిత్రాలకు కనీస్ ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. మొన్న సంక్రాంతికి తెలుగులో విడుదలైన ‘పేట’కు తెలుగులో రూ.కోటిన్నరు షేర్ కూడా రాబట్టలేకపోయింది. ఎంత రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా సంక్రాంతి బరిలో ఉన్న దాని ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోె 2020 సంక్రాంతికి మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీక్కవెరు’ సినిమా సింగిల్‌గా థియేటర్లో వచ్చే అవకాశం ఉంది. వీలైతే..అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేము. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబుకు సైడ్ ఇస్తు నిజంగానే ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మిగతా హీరోలు పక్కకు తప్పుకోవడం విశేషం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.