ఆ విషయంలో సన్ని లియోన్ టాప్.. ‘సరిలేరు నీకెవ్వరు’అంటున్న నెటిజన్స్..

సన్నీ లియోన్

సన్ని లియోన్..ఈ పేరు చెబితే నెట్‌లో ఎన్నైతే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో అవన్ని కూడా  వేడెక్కిపోతున్నాయి. తాజాగా ఈ భామ మరోసారి  తన పేరుతోనే సోషల్ మీడియాతో పాటు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ  హీట్ ఎక్కించింది.

 • Share this:
  సన్ని లియోన్..ఈ పేరు చెబితే నెట్‌లో ఎన్నైతే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో అవన్ని కూడా  వేడెక్కిపోతున్నాయి. తాజాగా ఈ భామ మరోసారి  తన పేరుతోనే సోషల్ మీడియాతో పాటు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ  హీట్ ఎక్కించింది. 2019లో నెట్‌లో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాజితాలో సన్ని లియోన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాదు గత పదేళ్లలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వ్యక్తి ఈమెనట. ప్రముఖ సెర్చింజన్ యాహూ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘యాహూ’ ప్రతి యేడాది మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ పేరుతో ప్రతి యేడాది ఎక్కువ మంది నెటిజన్లు వెతుకుతున్న పేర్లు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే కదా. 2019లో మోస్ట్ సెర్చ్ పర్సన్‌గా సన్ని లియోన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్‌లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. గత మూడు నాలుగేళ్లుగా సన్ని లియోన్ మొదటి స్థానంలో నిలిచింది.

  Sunny Leone Beats Salman Khan in Most Searched Celebrity On Google
  సల్మాన్ ఖాన్, సన్నిలియోన్ (ఫైల్ ఫోటో)


  ఈ దశాబ్ధంలోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా ‘దంగల్’ నిలిచినట్టు యాహూ తెలిపింది. 2016 విడుదలైన ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా రూ.2 వేల కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ‘బజరంగీ భాయిజాన్’, ‘పీకే’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘ధూమ్ 3’,‘సంజూ’, ‘వార్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాల కోసం ఎక్కువ మంది నెటిజన్స్ వెతికినట్టు తెలిపింది. ఇక హీరోల్లో ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌గా హృతిక్ రోషన్, హీరోయిన్స్ ‌లో సారా అలీ ఖాన్ నిలిచారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: