Balakrishna - Tollywood Meeting: చిరంజీవి ఇంట్లో మీటింగ్.. బాలయ్యను అంతా వదిలేసారా.. బాలయ్యే అందర్నీ వదిలేసాడా..?

Balakrishna Photo : Twitter

Balakrishna - Tollywood Meeting: ఇండస్ట్రీలో చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి క్రమం తప్పకుండా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అందులో హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు.

  • Share this:
ఇండస్ట్రీలో చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి క్రమం తప్పకుండా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అందులో హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. చిరంజీవి ఇంట్లోనే ఎక్కువగా ఈ మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సారి కూడా చిరు ఇంట్లోనే ఇది జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల గురించి ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చించుకున్నారు. అక్కడున్న పరిస్థితుల కారణంగా చాలా వరకు మీడియం రేంజ్, పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. టికెట్ రేట్ల తగ్గింపు ఉండటం.. మూడు షోలకు మాత్రమే అనుమతి ఉండటం దీనికి ప్రధాన కారణం.

వీటన్నింటి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన్ని కలిసి ఈ విషయాల గురించి చర్చించేందుకు ప్రయత్నించారు కానీ అందుకు జగన్ నుంచి అనుమతి రాలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి మరో ఇద్దరితో భేటీ అయ్యేందుకు జగన్ సానుకూలంగా స్పందించి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని తెలిపారు. దాంతో అసలు ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల్లో దేని గురించి ఎక్కువగా చర్చించాలనే విషయాన్ని చర్చించుకోడానికి చిరు ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంతా.

tollywood celebs,tollywood meeting,telugu industry meeting in chiranjeevi house,tollywood meeting with ys jagan,tollywood chiranjeevi balakrishna,balakrishna missing in tollywood meeting,telugu cinema,టాలీవుడ్ ప్రముఖులు,టాలీవుడ్ మీటింగ్,టాలీవుడ్ మీటింగ్ చిరంజీవి ఇంట్లో,జగన్ టాలీవుడ్ మీటింగ్,బాలయ్య మిస్సింగ్ టాలీవుడ్ మీటింగ్
చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్ (CCC Chiranjeevi meeting)


అందులో నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, వినాయక్, ఆర్.నారాయణ మూర్తి లాంటి పెద్దలు పాల్గొన్నారు. ఈ ఫోటోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఈ మీటింగ్‌లో నందమూరి బాలకృష్ణ కనిపించలేదు. వాళ్లు బాలయ్యను పట్టించుకోవడం లేదా లేదంటే అందర్నీ బాలయ్యే పట్టించుకోవడం లేదా అనేది అర్థం కావడం లేదు. గతంలో కూడా తనను కావాలనే మీటింగ్‌లకు దూరం పెడుతున్నారని ఆయన సీరియస్ అయ్యారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుపుతున్నారా అంటూ ఆయన మండిపడ్డాడు. దాని తర్వాత ఇష్యూ చాలా దూరం వెళ్లింది. ఇప్పుడు మళ్లీ బాలయ్య ఎలా స్పందించబోతున్నాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: