Nayanthara: నయనతార కుమారి కాదా.. సైలెంట్‌గా శ్రీమతి అయిపోయిందా..?

Nayanthara marriage: నయనతార ఇప్పటి హీరోయిన్ కాదు.. ఈమెతో పాటు వచ్చిన హీరోయిన్లంతా ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కుటుంబాలతో ఉన్నారు. కానీ నయన్ మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయినే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 28, 2020, 10:19 PM IST
Nayanthara: నయనతార కుమారి కాదా.. సైలెంట్‌గా శ్రీమతి అయిపోయిందా..?
నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)
  • Share this:
నయనతార ఇప్పటి హీరోయిన్ కాదు.. ఈమెతో పాటు వచ్చిన హీరోయిన్లంతా ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కుటుంబాలతో ఉన్నారు. కానీ నయన్ మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయినే. ఇంకా చెప్పాలంటే సౌత్ నెంబర్ వన్ హీరోయిన్. ఒక్కో సినిమా కోసం దాదాపు 5 కోట్లకు పైగానే తీసుకుంటుంది ఈ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌తో హీరోలతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తుంది నయనతార. అయితే ఎంత క్రేజ్ ఉన్నా కూడా వయసు మాత్రం ఆగదు కదా.. ఇప్పుడు నయనతారకు కూడా ఇదే సమస్యగా మారుతుంది. ఈమె ఏజ్ 35 దాటిపోయింది. దాంతో మొహంలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి.
నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)
నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)


గతేడాది విడుదలైన సైరాలో ఈమె వయసు కూడా స్పష్టంగా కనిపించిందనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ఇవే మాటలు వచ్చాయి. దాంతో ఇప్పుడు తన అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఈమె ఇప్పుడు మిస్ కాదు మిసెస్ అంటూ వార్తలొస్తున్నాయి. ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకుందని ప్రచారం జరుగుతుంది. తమిళనాట ఓ అగ్ర మీడియా సంస్థ ఈ ఇద్దరి పెళ్లిపై కథనం కూడా ప్రచురించింది.
నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)
నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)

చాలా రోజుల నుంచి కూడా తమిళ్ మీడియాలో నయన్ పెళ్లి గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి వచ్చింది. విఘ్నేష్ శివన్‌ను ఈమె పెళ్లి చేసుకుంది కానీ పైకి మాత్రం సహజీవనం అన్నట్లు చెప్తున్నారంటూ దీని సారాంశం. అయితే దీనిపై ఎప్పట్లాగే ఈ ఇద్దరూ స్పందించడం లేదు. కానీ మొన్నటికి మొన్న విఘ్నేష్ మాత్రం తమ పెళ్లిపై నోరు విప్పాడు.
నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)
నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)

జీవితం ప్రస్తుతం చాలా హాయిగా ఉందని చెప్పుకొచ్చాడు విఘ్నేష్. తను డేటింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు ఈ దర్శకుడు. డేటింగ్ బోర్ కొడితే అప్పుడు పెళ్లి చేసుకుంటామని విచిత్రమైన సమాధానం చెప్పాడు విఘ్నేష్ శివన్. అయితే పెళ్లి విషయంలో నయన్ మాత్రం ఎప్పుడూ నో చెప్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈమెకు పెళ్లి కలిసిరాలేదు. రెండుసార్లు శ్రీమతి కాబోయి కుమారిగానే మిగిలిపోయింది. మళ్లీ ఇప్పుడు పుకార్లు మొదలయ్యాయి.
Published by: Praveen Kumar Vadla
First published: September 28, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading