• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ONCE AGAIN LAWRENCE RAGHAVA HELP TO CORONA INFECTED PREGNANT WOMAN TA

మరోసారి పెద్ద మనసు చాటుకున్న లారెన్స్.. ఇతనే నిజమైన హీరో అంటున్న నెటిజన్స్..

మరోసారి పెద్ద మనసు చాటుకున్న లారెన్స్.. ఇతనే నిజమైన హీరో అంటున్న నెటిజన్స్..

రాఘవ లారెన్స్: అక్టోబర్ 29, వయసు 44

ప్రముఖ దర్శకుడు హీరో అయిన లారెన్స్ రాఘవ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తున్నాడు లారెన్స్ రాఘవ. తాజాగా ఈయన కరోనా సోకిన గర్బిణికి సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు.

  • Share this:
    ప్రముఖ దర్శకుడు హీరో అయిన లారెన్స్ రాఘవ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తున్నాడు లారెన్స్ రాఘవ. అంతేకాదు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొనే  బడా హీరోలు కూడా  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏదో ఇవ్వాలన్నట్టు విరాళం ఇచ్చారు కానీ మనస్పూర్తిగా ఎవ్వరు విరాళం ఇవ్వలేదనే సంగతి దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ  లారెన్స్ మాత్రం తన స్థాయికి మించి కరోనాపై పోరాటంలో త‌న వంతు సాయంగా ఏకంగా రూ. 3 కోట్లు విరాళం అందజేసారు. ఈ విరాళంలో  త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు.. ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు రూ. 50 లక్షలు.. రూ. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు రూ.  25 లక్షలు..రూ. 75 ల‌క్ష‌లు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు లారెన్స్. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న సినిమా కోసం తీసుకున్న రూ.  3 కోట్ల అడ్వాన్స్‌ ఒక్క రూపాయి కూడా తన ఖాతాలో వేసుకోకుండా క‌రోనాపై చేస్తున్న పోరాటానికి విరాళంగా ఇచ్చేసాడు లారెన్స్. అంతేకాదు పేదలను ఆదుకునేందుకు ఆయా హీరోలను తమ తోచినంత సాయం చేయమని అభ్యర్ధిస్తున్నాడు. ఇప్పటికే లారెన్స్ కు రజినీకాంత్ 100 క్వింటాల్ల బియ్యం పేదలకు పంచమని పంపించన సంగతి ఈ సందర్భంగా లారెన్స్ ప్రస్తావించారు.

    Once again lawrence raghava help to corona infected pregnant woman,raghava lawrence,raghava lawrence help to corona infected woman,raghava lawrence help to pregnent woman,Raghava Lawrence Generous Help Of 5 lakh 75 thousand,aghava lawrence twitter,raghava lawrence donation,raghava lawrence 3 crore donation corona,raghava lawrence dance,raghava lawrence movies,kanchana 3,lawrence,raghava lawrence dance performance,raghava lawrence songs,raghava lawrence (film director),raghava lawrence kanchana movie,raghava lawrence tamil movies,raghava lawrence new movie,raghava lawrence (film writer),akshay kumar donates rs 1.5 crore,రాఘవ లారెన్స్,రాఘవ లారెన్స్ 3 కోట్ల విరాళం,పేద నృత్య కళాకారులకు సాయం ప్రకటించిన లారెన్స్,గర్భిణికి సాయం చేసిన లారెన్స్,గర్భిణి మహిళకు సాయం చేసిన లారెన్స్ రాఘవ
    రజినీకాంత్‌తో రాఘవ లారెన్స్


    తాజాగా ఈయన కరోనాతో బాధపడుతున్న ఓ గర్బిణితకి  సాయం చేసాడు. ఆమె డెలివరి స్జేజ్‌లో ఉంది. ఆమె భర్త లారెన్స్‌ను ఆదుకోమని ఫోన్ చేసాడు. దీంతో లారెన్స్ తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్‌ పీఏ రవి గారితో మాట్లాడి ఆ గర్భిణికి సాయం చేయమని కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన సదరు సిబ్బంది.. ఆమెను  దగ్గరలో ఉన్న కేఎమ్‌సీ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు కరోనా వైరస్ ఉందన్న సంగతి తెలుసుకొని డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. అంతేకాదు తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు లారెన్స్. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న గర్భిణికి ఆపరేషన్ చేసి కాపాడిని వైద్యులను ఇందుకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి లారెన్స్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక లారెన్స్ చేసిన ఈ మంచి పనికి సోషల్ మీడియాలో నిజమైన హీరో మీరే అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: