స్టార్ హీరో ఇంటిపై మరోసారి ఐటీ పంజా.. 

దాంతో తెలుగులోనూ విజయ్ మార్కెట్ పెరిగిపోయిందిప్పుడు. తాజాగా ఈయన నటించిన మాస్టర్ సినిమా లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. నిజానికి ఎప్రిల్ 14నే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ లాక్‌డౌన్, కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ రాలేదు.

తమిళ్ హీరో తలపతి విజయ్ ఇంటిపై మరోసారి ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది.

  • Share this:
    తమిళ్ హీరో తలపతి విజయ్ ఇంటిపై ఈరోజు మరోసారి ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. కొన్ని రోజల క్రితం ఐటీ శాఖ విజయ్ ఇంటిమీద, అతని సంబంధించిన ఆఫీస్‌లపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ మధ్య విజయ్ నటించిన విజిల్ సినిమా విడుదల సందర్భంగా ఆ సినిమా ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్ ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. కాగా మరోసారి తాజాగా ఐటీ దాడులు జరగడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆయన అభిమానులు కూడా ఆదాయపన్ను అధికారులు కావాలనే విజయ్‌ను టార్గెట్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అభిమాన హీరోను బీజేపీ కావాలనే టార్గెట్ చేస్తోందని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్, సెటైర్లు ఉన్న సంగతి తెలిసిందే. మెర్సల్ సినిమా అటు తమిళంలోనే కాకుండా.. ఇటు తెలుగులో ‘అదిరింది’గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.


    కాగా ప్రస్తుతం విజయ్ 'మాస్టర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఈనెల 15 వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమాను కార్తీతో ఖైదీ సినిమా చేసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: