ONCE AGAIN HYPER AADI CONTORVERSIAL COMMENTS ON JABARDASTH ANCHOR ANASUYA BHARADWAJ TA
అనసూయ పై మరోసారి అనకూడని మాటలతో.. హైపర్ ఆది..
అనసూయ, హైపర్ ఆది
జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు.తాజాగా జరిగిన ఈ స్కిట్లో అనసూయ పై హైపర్ ఆది చేసిన స్కిట్ వివాదాస్పదమైంది.
జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ఆది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. ఒక్క హైపర్ ఆది మాత్రమే కాదు.. జబర్దస్త్ కమెడియన్లకు సినిమాలు అంతగా కలిసి రాలేదు. కానీ గత ఎన్నో ఎసిపోడ్స్లో హైపర్ ఆది..తన స్కిట్స్‌లో ఏదో ఒక సమయంలో అనసూయను కవ్విస్తూ కామెడీ చేస్తుంటాడు. ఇక అనసూయ కూడా హైపర్ ఆది చేసే ఇలాంటి స్కిట్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇక షో జడ్జెస్ నాగబాబు, రోజా కూడా హైపర్ ఆది చేసే స్కిట్స్‌ను పడి పడి నవ్వేవారు. కానీ గత కొన్ని ఎపిసోడ్స్‌లో హైపర్ ఆది చేసే స్కిట్స్‌లో అనసూయ పై చేసే కామెడీ తారా స్థాయికి చేరింది. తాజాగా జరిగిన ఎపిసోడ్లో ABCDEFFHIJK అంటూ అనసూయను ఆటపట్టిస్తూ ఒక చేసిన స్కిట్ చేసాడు. ఈ స్కిట్లో అనసూయను abcd అంటూ ఒక అర్ధం చెప్పిన IJK పదానికి ఐయామ్ జస్ట్ కిడ్డింగ్ అంటూ చెప్పిన హైపర్ ఆది చెప్పిన డైలాగుకు అనసూయ అవాక్కైంది.
అనసూయ,హైపర్ ఆది (ఫైల్ ఫోటోస్)
ఈ షో తర్వాత హైపర్ ఆదికి అనసూయ.. కాస్తంత గట్టిగానే క్లాస్ పీకినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రోజా,నాగబాబు కూడా హైపర్ ఆది చేసే స్కిట్స్ విషయంలో కాస్తంత సీరియస్ అయినట్టు సమాచారం. మరి ఇక హైపర్ ఆది ఎపిసోడ్‌తో మిగతా జబర్ధస్త్ పార్టిసిపేట్స్ కూడా ఒళ్లు దగ్గర పెట్టుకొని స్కిట్స్‌ను సరైన పద్ధతిలో వేస్తారా ? ఒకవేళ వేసినా ఆడియన్స్ ఆదరిస్తారా అనేది చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.