Home /News /movies /

ONCE AGAIN BIGG BOSS TELUGU TITLE GOES TO BOYS ONLY AND ARIYANA HARIKA ELIMINATED PK

Bigg Boss 4 Telugu: వరసగా నాలుగోసారి టైటిల్ అబ్బాయిలదే.. బిగ్ బాస్‌లో అమ్మాయిలకు నిరాశే..

బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

Bigg Boss 4 Telugu: అయిపోయింది.. ఈ సారి కూడా అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. బిగ్ బాస్ 4 తెలుగు విజేత కూడా అబ్బాయి సొంతం కాబోతుంది. సీజన్ 1 నుంచి 4వ సీజన్ వరకు కూడా అబ్బాయిలే విన్నర్ అవుతున్నారు.

అయిపోయింది.. ఈ సారి కూడా అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. బిగ్ బాస్ 4 తెలుగు విజేత కూడా అబ్బాయి సొంతం కాబోతుంది. సీజన్ 1 నుంచి 4వ సీజన్ వరకు కూడా అబ్బాయిలే విన్నర్ అవుతున్నారు. ఇప్పుడు కూడా హారిక, అరియానా కూడా ముందుగానే ఎలిమినేట్ అయిపోవడంతో టాప్ 3లో కూడా నిలవలేకపోయారు. దాంతో బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత అమ్మాయిలకు లేదా అంటూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. కచ్చితంగా తొలి మూడు సీజన్స్ అబ్బాయిలు గెలిచారు కాబట్టి ఈ సారి అమ్మాయి అవుతుందని మూడు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అభిజీత్ అని అందరూ అనుకుంటున్నా కూడా కాదు చివరి నిమిషంలో అద్భుతాలు జరుగుతున్నాయి అంటూ ప్రచారం మొదలైంది. దాంతో నిజమేనేమో.. ఈ సారి అమ్మాయికి టైటిల్ ఇస్తున్నారేమో అనే ఆశలు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ అబద్ధమే అని తేలిపోయింది. టాప్ 3లో కూడా లేకుండా అమ్మాయిలు ఇద్దరూ బయటికి వచ్చేసారు. హారిక, అరియానా ఇద్దరూ ముందుగానే ఎలిమినేట్ కావడంతో టాప్ 3లో అభిజీత్, అఖిల్, సోహెల్ నిలిచారు. సీజన్ 1 శివ బాలాజీ.. సీజన్ 2 కౌశల్.. సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు.
బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు

అప్పుడు కనీసం అమ్మాయిలు రెండో స్థానమైనా దక్కించుకున్నారు. కానీ సీజన్ 4 మాత్రం అది కూడా జరగలేదు. ఎందుకంటే ఈ సారి పూర్తిగా అబ్బాయిల డామినేషన్ కనిపించింది. ముందు నుంచి కూడా ప్రతీవారం అమ్మాయిలే వరసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరికి టాప్ 5లో ఇద్దరూ అమ్మాయిలు ఉన్నారనే సంతృప్తి ఉన్నా చివరికి వాళ్లు కూడా బయటికి వచ్చేసారు. దాంతో ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారమే నిజమయ్యేలా కనిపిస్తుంది. అభిజీత్ విన్నర్ అయితే.. అఖిల్ నెంబర్ 2తో సరిపెట్టుకునేలా కనిపిస్తున్నాడు. సోహెల్ మూడో స్థానంలో ఉండబోతున్నాడని తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు