తెలుగు తెరపై ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫార్ములా పోలీస్ క్యారెక్టర్. ఇప్పటికే చాలా మంది హీరోలు ఒంటిపై ఖాకీ డ్రెస్ వేసుకొని మంచి హిట్స్ అందుకున్నారు.తెలుగు సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ..తాజాగా చేస్తోన్న ‘రూలర్’ సినిమాలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ దీపావళి సందర్భంగా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఉన్న బాలకృష్ణ ‘రూలర్’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో కూడా బాలకృష్ణ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేసిన సినిమాలు ఎక్కువ మటుకు సక్సెస్ సాధించాయి. బాలకృష్ణ మొదటిసారి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.
ఆ సినిమా తర్వాత ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’ సినిమాలో కూడా పోలీస్ గెటప్‌లో అలరించాడు. ఆ తర్వాత ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’,‘మాతో పెట్టుకోకు’, ‘సుల్తాన్’ ‘భలేవాడివి బాసూ’, ‘సీమ సింహం’‘చెన్నకేశవ రెడ్డి’, ‘లక్ష్మీ నరసింహా’ ‘అల్లరి పిడుగు’, ‘పైసా వసూల్’, సినిమాల్లో పోలీస్ పాత్రల్లోమెప్పించాడు. ఇందులో పైసా వసూల్‌లో పోలీస్ ఆఫీసర్ కాకుండా సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు. ఇంకోవైపు ‘భలేవాడివి బాసూ’ సినిమాలో దొంగ పోలీస్ పాత్రలో మెప్పిండు. అంతేకాదు మంగమ్మ గారి మనవడు, విజయేంద్ర వర్మ, పరమ వీరచక్ర,అశ్వమేథం’ వంటి సినిమాల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన పాత్రలు చేయడం విశేషం. వీటిలో సగం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి.తాజాగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘రూలర్’ సినిమాతో బాలయ్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.