HappyMother'sDay : ఎన్టీఆర్‌తో షాలినీ అనుబంధం.. మాతృ దినోత్సవం సందర్భంగా..

తల్లి షాలినీతో ఎన్టీఆర్ Photo : Twitter

HappyMother'sDay : దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము.

  • Share this:
    HappyMother'sDay : దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము. ఓ బిడ్డకు ప్రాణం పోసే క్రమంలో తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది అమ్మ. అంతేకాదు ఏ క్షణంలోనైనా తన బిడ్డలకు ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. అమ్మ తాను కడుపు మాడ్చుకొనైనా తన బిడ్డల కడుపు నింపుతుంది. ప్రపంచవ్యాప్తంగా మే 10న ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీకోసం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీది ప్రత్యేకమైన స్థానం. అంతేకాదు ఈ కుటుంబానికి సంబంధించి ఏ విషయమైన తెలుగు వారందరికీ ఎంతో ఆసక్తి. ఇక మూడో తరంలో నందమూరి వారసులు అనగానే గుర్తోచ్చేది ఎన్టీఆర్. మదర్స్ డే సందర్భంగా ఎన్టీఆర్‌ తల్లి షాలినీ గురించి ఎవరకి తెలియని విషయాలను చర్చిద్దాం. ఎన్టీఆర్‌ను షాలినీ అల్లారుముద్దుగా పెంచుకుంది. సింగిల్ మదర్‌గా జీవనం కొనసాగిస్తూ.. ఎన్టీఆర్‌ను చిన్న తనంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడంతో పాటు ఓ చక్కని ప్రయోజకునిగా తీర్చిదిద్దింది. నందమూరి వంశంలో ఎంతో మంది యువ హీరోలు పరచయమైన ఒక ఎన్టీఆర్ మాత్రమే ప్రముఖంగా రాణిస్తున్నడంటే ఖచ్చితంగా ఆ క్రెడిడ్ షాలినీకి చెందుతుంది. చిన్నప్పటి నుండి తన కుమారున్ని ఆమె పెంచిన తీరు.. క్రమ శిక్షణ, అభ్యాసం ప్రస్తుతం మనం పెరిగిన ఎన్టీఆర్‌లో చూస్తుంటాం. ఓ వ్యక్తి గొప్పగా రాణిస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎంతో ఉంటుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ అంత అణకువగా ఉంటూ పెద్దలను గౌరవిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడంటే తల్లిగా షాలినీ పోషించిన పాత్రను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఏ మొక్క ఒక్కసారే మానుగా మారదు. అలా మారాలంటే చిన్నప్పుడు చావకుండా కాపాడుకోవాలి. ఆ తర్వాత వంకరగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఎన్నో చేస్తేగానీ అది మానుగా మారదు. కాబట్టి మదర్స్ డే సందర్బంగా ఎన్టీఆర్ తల్లి షాలినికి ఇవే మా మదర్స్ డే వందనాలు.

    ఇక ఎన్టీఆర్ షాలినీ అనుబంధం గురించి కొన్ని విషయాలను చర్చిద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఆయన తల్లి షాలినీ మాత్రం ముందు నుంచి కూడా తెరవెనుక మనిషిగానే ఎక్కువగా ఉంటూ వస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె మాత్రం బయట ప్రపంచానికి దూరంగానే ఉంటున్నారు. ఆమె యమదొంగ సినిమా ఫంక్షన్‌లో ఒకసారి ప్రజలముందుకు వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు షాలినితో పెళ్లి కంటే ముందే లక్ష్మీ తో వివాహం జరిగింది. అంటే ఎన్టీఆర్ తల్లి షాలిని హరికృష్ణకు రెండో భార్య అయితే.. చాలా మంది హరికృష్ణ షాలినిని పెళ్లి చేసుకోలేదని వారిద్దరిది లివింగ్ రిలేషన్ షిప్ లేదా సహజీవనం సాగించారని అంటారు. ఇక్కడ చాలామందికి తెలియనీ విషయం ఏమంటే షాలిని ఓ మ్యూజిక్ టీచర్‌గా పెద్ద ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేందుకు వచ్చేవారట. ఆ సమయంలోనే సినీయర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో.. ఆయనకు సహాయంగా హరికృష్ణ ఎక్కువగా ఇంట్లోనే ఉండే వారట. అప్పుడే హరికృష్ణకు షాలినీతో పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి చివరకు ప్రేమగా చిగురించిందట.
    Published by:Suresh Rachamalla
    First published: