మాతృమూర్తులతో చిరంజీవి, మహేష్, అల్లు అర్జున్.. ఆసక్తికర వ్యాఖ్యలు..

చిరంజీవి, మహేష్, అల్లు అర్జున్ Photo : Twitter

మదర్స్ డే సందర్భంగా సినీనటులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Share this:
    మదర్స్ డే సందర్భంగా సినీనటులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు వారు తమ తల్లులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగా చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తన తల్లికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు తాను తల్లితో తీసుకున్న ఫొటోలకు జత చేసి వీడియోను రూపొందిచారు. ఈ సందర్భంగా చిరంజీవి.. జీవితంలో మనకు సంబంధించిన ప్రతి కథ వెనుక మన తల్లి కథ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే అమ్మకు సంబంధించిన కథతోనే మనందరం జీవితాలను మొదలుపెట్టామని తెలిపారు. మరో స్టార్ హీరో మహేష్ కూడా మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి ఫొటోతో పాటు తన భార్య నమ్రత ఫొటోను షేర్ చేస్తూ... 'నా జీవితానికి మార్గదర్శకాలుగా నిలిచింది ఈ ఇద్దరే అంటూ.. అసాధారణ ప్రేమ కురిపించే మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే' అని మహేష్ ట్వీటాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా త‌న త‌ల్లికి మ‌ద‌ర్స్ డే అభినంద‌నలు తెలియ‌జేశాడు. ఈ సందర్భంగా ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మన దగ్గర చాలా ఉన్నా కూడా సింపుల్‌గా ఎలా ఉండాలో అనే విషయాన్ని మా అమ్మ ద‌గ్గ‌ర నేర్చుకున్నాను. మా అమ్మ‌తో పాటు ప్ర‌పంచంలోని అమ్మ‌లంద‌రికీ హ్యాపియ‌స్ట్ మ‌ద‌ర్స్ డే’’ అంటూ తన తల్లితో ఉన్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: