ON THE OCCASION OF INDEPENDENCE DAY MAHESH BABU SARILERU NEEKEVVARU TITLE SONG RELEASED TA
స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి సైనికుడి సాంగ్ విడుదల..
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)
Sarileru Neekevvaru Title Song | ప్రస్తుతం మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమాలో సరిలేరు నీకెవ్వరు అంటూ సైనికుల గొప్పదనాన్నిచాటే పాటను విడుదల చేసారు.
ప్రస్తుతం మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే కాశ్మీర్లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. ఈ షెడ్యూల్లో కొన్ని యుద్ధ పోరాటాలకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారు. మేజర్ అజయ్ కృష్ణగా ఉగ్రవాదులను ఏరిపారేసే సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు మహేష్ బాబు. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమాలో సరిలేరు నీకెవ్వరు అంటూ సైనికుల గొప్పదనాన్నిచాటే పాటను విడుదల చేసారు. భారత్ పాకిస్థాన్ యుద్ధం నుంచి నిన్నమొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ వరకు భారత జవానులు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఈ పాటలో చూపించారు. మరోవైపు సైనికుడిగా మహేష్ బాబు ఆహార్యం బాగా ఉంది.
ఈ రకంగా దేశంలో అంతర్గత శతృవులపై మేజర్ అజయ్ కృష్ణ చేసే పోరాటమే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాతో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.16.5 కోట్లకు అమ్ముడుపోయింది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబు మరోసారి హాట్రిక్ హిట్ నమోదు చేస్తాడా లేదా అనేది చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.