Janhvi Kapoor: శ్రీదేవి జయంతి రోజున జాన్వీ కపూర్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్స్..

జాన్వీ కపూర్ (Instagram/Photo)

Janhvi Kapoor | తన తల్లి శ్రీదేవి జయంతి రోజున జాన్వీ కపూర్ చేసిన పనిని చూసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    తన తల్లి శ్రీదేవి జయంతి రోజున జాన్వీ కపూర్ చేసిన పనిని చూసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ మంగళవారం శ్రీదేవి జయంతి. తల్లి పుట్టినరోజున కూడా జాన్వీ కపూర్ యథావిధిగా తన షూటింగ్‌తో పాటు జిమ్‌కు సంబంధించిన కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి బయలు దేరబోతుండగా ఒక వీధిలో అడుక్కుతినే ఒక కుర్రాడు జాన్వీ కపూర్‌ను డబ్బులు ఇవ్వమని వెంటపడ్డాడు. ఇక జాన్వీ కపూర్ పర్స్ చేతిలో ఉన్న అందులో కార్డ్స్ తప్ప మనీ లేకపోవడంతో..  కామ్‌గా వచ్చిన తన వెహికల్‌లో కూర్చుంది. ఆ తర్వాత తన పర్సనల్ డ్రైవర్ దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని మరి ఆ బాలుడికి ఇచ్చింది. జాన్వీ కపూర్ చేసిన ఈ పనిని ఒక నెటిజన్ తన కెమెరాలో బంధించాడు. అంతేకాదు సదరు ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.



     




    View this post on Instagram




     

    @janhvikapoor is really so kind and humble . I can't express her kindness by words. #janhvikapoor #janhvikapoor06 #janhvians


    A post shared by Janhvi Kapoor (@janhvikapoor06) on





    ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు జాన్వీ కపూర్ చేసిన ఈ పనిని అందరు మెచ్చుకుంటున్నారు. కొందరైతే..స్వర్గంలో ఉన్న శ్రీదేవి తన కూతురు చేసిన పనిని చూసి సంతోషిస్తుందని మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తానికి తన తల్లి జయంతి రోజున జాన్వీ ఒక పిల్లాడిపై చూపిన ఔదార్యాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. మరికొందరు ఇలా ఆ బాలుడికి డబ్బులు దానం చేసే కన్నా.. చదువుకోవడానికి జాన్వీ ఏదైనా మార్గం చూపిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఏమైనా జాన్వీ కపూర్ చేసిన ఈ పని ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 
    Published by:Kiran Kumar Thanjavur
    First published: