కరోనా క్రైసిస్ ఛారిటీకి మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి విరాళం..

ప్రస్తుతం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకండా భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం మహేష్ బాబు సోదరి విరాళం ప్రకటించారు.

news18-telugu
Updated: April 8, 2020, 1:37 PM IST
కరోనా క్రైసిస్ ఛారిటీకి మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి విరాళం..
పద్మావతి గల్లా విరాళం (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకండా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం కేంద్రం 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు చప్పట్లతో పాటు... దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. మరోవైపు కరోనా పై పోరులో సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వంతు విరాళాలు అందజేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా పని లేకుండా పోయిన వారికోసం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసారు. అందులో భాగంగా..  కరోనా క్రైసిస్ ఛారిటీకి అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తరఫున ప్రముఖ నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క ప‌ద్మావ‌తి గ‌ల్లా 10 లక్షల రూపాయల విరాళం అందించారు.

On Behalf Of Amara Raja Media and Entertainment Pvt Ltd Producer Padmavathi Galla Contributes Rs 10 Lakhs To CCC For The Welfare Of Cine Workers,mahesh babu,mahesh babu galla padmavathi,galla padmavathi donates 10 lakh rupees to corona crisis charity,galla jayadev, Amara Raja Media and Entertainment Pvt Ltd Producer Padmavathi Galla Contributes Rs 10 Lakhs,galla padmavathi coronavirus,tollywood,telugu cinema,కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం గల్లా జయదేవ్ విరాళం,మహేష్ బాబు అక్క గల్లా పద్మావతి విరాళం,కరోనా క్రైసిస్ ఛారిటీకి గల్లా పద్మావతి విరాళం
కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం పద్మావతి విరాళం (Twitter/Photo)


గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా కుమారుడు అశోక్ గ‌ల్లా ను హీరోగా పరిచయం చేస్తూ అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా మాట్లాడుతూ, లాక్‌డౌన్ నేప‌థ్యంలో అంద‌రూ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు. ప్ర‌భుత్వాలు, డాక్ట‌ర్లు, పోలీసులు చెబుతున్న స‌ల‌హాలు, సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో భాగ‌స్వాములు కావాల‌న్నారు.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading