OMKAR STRAIGHT QUESTIONS MUMAITH KHAN DANCEE PLUS SHOW LATEST PROMO MNJ
Dancee Plus: ఏంటి మీ జడ్జిమెంట్.. ఆ జడ్జికి ఓంకార్ అన్నయ్య సూటి ప్రశ్న
డ్యాన్స్ ప్లస్ ఓంకార్
Dancee Plus: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మాలో వచ్చే రియాలిటీ షో డ్యాన్స్ ప్లస్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్సర్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు ఒకరికి మించి ఒకరు డ్యాన్స్‌లలో పోటీ పడుతూ అదరగొట్టేస్తున్నారు. శనివారం, ఆదివారం ప్రసారం అవుతున్న ఈ షోకు బాబా భాస్కర్, రఘు, యశ్, ముమైత్ ఖాన్, ఆనీ, మోనాల్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
Dancee Plus: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మాలో వచ్చే రియాలిటీ షో డ్యాన్స్ ప్లస్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్సర్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు ఒకరికి మించి ఒకరు డ్యాన్స్‌లలో పోటీ పడుతూ అదరగొట్టేస్తున్నారు. శనివారం, ఆదివారం ప్రసారం అవుతున్న ఈ షోకు బాబా భాస్కర్, రఘు, యశ్, ముమైత్ ఖాన్, ఆనీ, మోనాల్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షోలో మరో ఎలిమినేషన్ ఉండబోతోంది. ఎలిమినేషన్‌ని నామినేషన్ ప్రారంభించాలంటూ ఓంకార్ జడ్జిలకు తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవల ప్రోమోలు విడుదల అయ్యాయి. ఈ క్రమంలో మొన్న వచ్చిన ప్రోమోలో ముమైత్ ఖాన్ టీమ్ నుంచి రామ్ లక్ష్మణ్‌ని మిగిలిన ఐదుగురు ఎంపిక చేశారు. దీంతో ఆమె హర్ట్ అయ్యింది.
ఇక ఈ షోకు సంబంధించి మరో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో ముమైత్ ఖాన్ చిన్నపిల్లలు చేసిన డ్యాన్స్‌కి మైనస్ మార్కులు వేసి.. మరో టీమ్‌కి ప్లస్ వేసింది. దీంతో ఓంకార్ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇద్దరిలో మైనస్ పాయింట్లు ఉన్నాయని చెప్పి.. ఒక టీమ్‌కి ప్లస్, మరో టీమ్‌కి మైనస్ వేయడం ఏంటని ఓంకార్ అడిగాడు.
టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం కోసం మీరు ప్లస్ వేశారు నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్లు చిన్నపిల్లలు. ఎంతో భవిష్యత్ ఉన్నవారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా మైనస్ వేశారు అని ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇక ఓంకార్ మాటలతో అక్కడున్న కంటెస్టెంట్లు అందరూ క్లాప్స్ కొట్టడం విశేషం. మరి ఓంకార్ మాటలకు ముమైత్ ఏం సమాధానం చెప్పిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే సాధారణంగానే ఓంకార్ టీఆర్పీ స్ట్రాటెజీని బాగా ఫాలో అవుతుంటారు. మరి ప్రోమోను చూస్తుంటే ఇది కూడా టీఆర్పీ స్ట్రాటెజీలో భాగమేనని కొందరు భావిస్తున్నారు.