జైరా వాసిమ్ నిర్ణయంపై స్పందించిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా..

‘దంగల్’ సినిమాలో ఆమీర్ ఖాన్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న జైరా వాసిం..తాను ఇక సినిమాల్లో నటించబోనని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.జైరా వాసిమ్ సినిమాలకు గుడ్ బై చెప్పడంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.

news18-telugu
Updated: July 1, 2019, 8:36 AM IST
జైరా వాసిమ్ నిర్ణయంపై స్పందించిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా..
జైరా వాసీమ్, ఒమర్ అబ్డుల్లా (ఫైల్ ఫోటో)
  • Share this:
‘దంగల్’ సినిమాలో ఆమీర్ ఖాన్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న జైరా వాసిం..తాను ఇక సినిమాల్లో నటించబోనని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.ముస్లిమ్‌లకు వ్యతిరేకంగా బెదిరింపులకు దిగుతున్న కారణంగా ఆమె సినీ ఇండస్ట్రీ నుంచి వైదొలగాలనుకున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఆమె ప్రశాంతతను, ఆమెకు దేవుడితో ఉన్న అనుబంధాన్ని చెడగొట్టేలా ఉన్న ఈ వాతావరణంలో  జీవించలేను అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. జైరా వాసిమ్ సినిమాలకు గుడ్ బై చెప్పడంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. జైరా వాసిం తీసుకున్న ఈ  నిర్ణయంపై స్పందిచాడానికి మనమెవరు ? ఎవరి జీవితం వాళ్ల ఇష్టం. వాళ్ల ఇష్టప్రకారమే మంచి జరగాలని కోరుకుంటున్నాని చెప్పారు.కాశ్మీర్‌కు  ‘జైరా’.. ‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. సినిమా ఇండస్ట్రీ వైదొలగడం ఓకే కానీ..ఆమెకు బాలీవుడ్‌లో ఎదురైన అనుభవాలను మాత్రం వెల్లడించకపోవడం విశేషం.First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు