రష్మిక అంటేనే భయపడుతున్న మహేష్ బాబు

ముద్దుగుమ్మ సినిమాలన్నీ మంచి పేరు తెచ్చుకున్నా... రష్మిక ఎక్కడ గ్లామర్ షో మాత్రం చేయలేదు. దీంతో ఇప్పుడీ విషయంలోనే మహేష్ బాబుకు టెన్షన్ పట్టుకుంది.

advertorial
Updated: October 8, 2019, 4:48 PM IST
రష్మిక అంటేనే భయపడుతున్న మహేష్ బాబు
మహేష్ బాబు 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’
  • Advertorial
  • Last Updated: October 8, 2019, 4:48 PM IST
  • Share this:
‘మహర్షి’ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న మహేష్... తన తర్వాత సినిమాను కూడా అదే ఊపుతో చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అంతా బాగానే ఉంది కానీ... ఈ సినిమా హీరోయిన్ విషయంలోనే మహేష్ కాస్త భయపడుతున్నాడని తెలుస్తుంది. రష్మిక మందన హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలన్నీ మంచి పేరు తెచ్చుకున్నా... రష్మిక ఎక్కడ గ్లామర్ షో మాత్రం చేయలేదు. కేవలం ముద్దుసీన్లలో మెప్పించిన ఈ క్యూట్ భామ... అంతకు మించి ఏ సినిమాలో కూడా స్కిన్ షో చేయలేదు. దీంతో ఇప్పుడీ విషయంలోనే మహేష్ కాస్త జంకుతున్నట్లు టాక్. అందుకే మరో హీరోయిన్‌తో మంచి మసాలా సాంగ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఇప్పటికే మహర్షి సినిమాలో మహేష్ బాబుతో కలిసి స్టెప్పులేసిన హాట్ బ్యూటీ పూజా హెగ్డే కూడా .. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మహర్షి సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ బాగా పండిందని గ్రహించి.. సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలో.. ఆమెతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు సరిలేరు నీకెవ్వరులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా మెరవనుంది. తమ్ముతో పాటు... మరో సాంగ్ కోసం హాట్ బ్యూటీ పూజ హెగ్డేను తీసుకోవాలని దర్శకుడు ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో... రష్మిక మందన్నా, తమన్నా, పూజ హెగ్డే.. ముగ్గురు ముద్దుగుమ్మలతో సూపర్ స్టార్ స్టెప్పులేయనున్నాడు.

ఇక ఈ సినిమాతోనే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా స్టిల్‌ను మహేష్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. దసరా రోజునే డబ్బింగ్ కూడా ప్రారంభించినట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు