జబర్ధస్త్ నుంచి వీళ్లు ఔట్... వాళ్లు రీ-ఎంట్రీ..

జబర్ధస్త్ ద్వారా పాపులరై సినిమాల్లోకి వెళ్లిపోయిన వేణు వండర్స్, ధనాధన్ ధన్‌రాజ్, శకలక శంకర్ లాంటి వారిని తిరిగి మళ్లీ జబర్ధస్త్‌లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: November 21, 2019, 6:56 PM IST
జబర్ధస్త్ నుంచి వీళ్లు ఔట్... వాళ్లు రీ-ఎంట్రీ..
జబర్దస్త్ లోగో
  • Share this:
జబర్ధస్త్ నుంచి కొన్ని టీమ్‌లు బయటకు వెళ్లిపోతుండటంతో... వారి స్థానంలోకి ఎవరు వస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. జబర్ధస్త్ ద్వారా ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుని... ఆ కార్యక్రమానికే స్టార్స్‌గా మారిన హైపర్ అది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ టీమ్స్... ఇందులో నుంచి బయటకు వెళ్లిపోవడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేసి... అదే స్థాయిలో కామెడీ పండించబోయేది ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జబర్ధస్త్‌లోకి మళ్లీ పాత టీమ్ సభ్యులను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్ధస్త్ ద్వారా పాపులరై సినిమాల్లోకి వెళ్లిపోయిన వేణు వండర్స్, ధనాధన్ ధన్‌రాజ్, శకలక శంకర్ లాంటి వారిని తిరిగి మళ్లీ జబర్ధస్త్‌లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లు మళ్లీ జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇస్తే... కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన స్థానాలు భర్తీ అవుతాయనే భావనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్టు సమాచారం. జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన వాళ్లు... మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు కాబట్టి... వీళ్లు కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Published by: Kishore Akkaladevi
First published: November 21, 2019, 6:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading