ఒక సినిమా హిట్ అయితే చాలు.. దానికి సీక్వెల్ తీయడమో గానీ, అదే సినిమా ను ఇతర లాంగ్వేజ్ లోకి రీమేక్ చేయడమో చేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు హిట్ అయినా సినిమా టైటిల్స్‌ను పెట్టి.. సక్సెస్ సాధిస్తున్నారు మన దర్శకులు. ఈ ట్రెండ్ ఈ మధ్య మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాకు టైటిల్ ఒక పెద్ద అసెట్. అదే.. సినిమాను సగం విజయాన్ని తెచ్చిపెడుతుంది. అందరికి తెలిసిన పేర్లు పెట్టడమో లేక.. కొత్త పేర్లను సృష్టించడమో చేస్తారు దర్శకులు. అలాంటివే ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ట్రెండ్ ను నడిపిస్తున్నాయి. ఈ మధ్య సూపర్ హిట్ అయినా సినిమాల టైటిల్ కొత్త మూవీలకు పెట్టడం కామాన్ అయిపోయింది. తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టారు. పేరు బాగానే మెగా ఫ్యాన్స్ మాత్రం నాని ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంటి ? ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటూ నానిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్కొసారి పాత సినిమా టైటిల్స్ బాగున్నా..వాటిని వాడేసి అవీ సరిగా నడవకపోతే వాటి ఓల్డ్ టైటిల్స్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు.
మరోవైపు కార్తి కూడా చిరంజీవి పాత సూపర్ హిట్ ‘ఖైదీ’ సినిమా టైటిల్‌ను కొత్త మూవీకి పెట్టుకోవాలని చూస్తున్నాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్లో రియాక్ట్ అవుతారో చూడాలి.
అంతకుమాందు నాగార్జున, నాని హీరోలుగా వచ్చిన ‘దేవదాస్’ కూడా ఒకప్పటి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ దేవదాసును కొంచెం ఛేంజ్ చేసి ఆ పేరు పెట్టారు. గతంలో వేణుమాధవ్ "ప్రేమాభిషేకం".. "భూకైలాస్" లాంటి క్లాసిక్స్ ముట్టుకుని నాశనం చేసాడు. ఈ రెండు సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు. ఇలాంటి టైటిల్స్ వాడుకుని వాటి విలువ తీసాడు వేణుమాధవ్. విజయం రాకపోగా ఈ సినిమాలతో విమర్శలు కూడా అందుకున్నాడు ఈ కమెడియన్.
నాగశౌర్య హీరోగా వచ్చిన ఈ చిత్రం కూడా "నర్తనశాల" టైటిల్ పెట్టుకుని దానికి తగ్గట్లుగా అలరించలేకపోతుంది. గే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ టైటిల్ వాడేసుకున్నాడు కానీ అందులో విషయం మాత్రం అంతగా లేదు. దాంతో ఇలా లెజెండరీ టైటిల్స్ వాడుకుని వాటికి ఉన్న పేరు నాశనం చేయడం కంటే ఏదో ఓ టైటిల్ వాడుకోవచ్చు కదా అంటున్నారు అభిమానులు. మరి వీటిని చెవిన పెట్టుకుంటారో లేదో దర్శకులు.
ఇక మరో హీరో వరుణ్ సందేశ్ అయితే ఏకంగా "లవకుశ" టైటిల్ వాడేసుకున్నాడు. అసలు దీని విలువ కూడా పట్టించుకోకుండా పిచ్చి సినిమాకు వాడేసుకున్నాడు. "మరోచరిత్ర" అంటూ బాలచందర్ మధుర కావ్యాన్ని మరిచిపోయేలా చేసాడు వరుణ్ సందేశ్. దానికితోడు మొన్నటికి మొన్న ఇవివి సత్యనారాయణ ఆల్ టైమ్ క్లాసిక్ "జంబ లకిడి పంబ" టైటిల్ శ్రీనివాస రెడ్డి వాడుకుని నాశనం చేసాడు. ఆ టైటిల్‌కు ఉన్న విలువ పెంచుతాం అంటూ తగ్గించేసాడు.
b
1951 లో ఎన్టీఆర్ నటించిన మల్లీశ్వరికి, 2004లో వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి సినిమాకు ఏ మాత్రం పోలిక ఉండదు. వెంకటేశ్ సినిమాకు ఆ పేరు పెట్టే సరికి ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరిగింది. అయితే వెంకటేశ్ మల్లిశ్వరి సినిమాలో హీరోయిన్ కి పెట్టి న్యాయం చేశారు దర్శకనిర్మాతలు.
సునీల్ కూడా ఒకప్పటి అక్కినేని సూపర్ హిట్ ‘పూలరంగడు’ టైటిల్‌ను తన కొత్త సినిమాకు వాడుసుకున్నాడు.కోనవెంకట్ అయితే మరీ దారుణం.. "శంకరాభరణం" సినిమా టైటిల్‌ను ఖూనీ చేసాడు. నిఖిల్‌తో చేసిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. 'గీతాంజలి" బతికించినా.. ఇప్పటికీ అవే పాత టైటిల్స్ వైపు అడుగేస్తున్నాడు కోనవెంకట్.
ఈ మధ్య వచ్చిన కామెడీ హార్రర్ మూవీ గీతాంజలి కూడా పాత టైటిలే. నాగార్జున హిట్ కు హిట్ టాక్ తెచ్చిపెట్టిన మూవీ టైటిల్ నే హార్రర్ సినిమాకు పెట్టుకున్నారు. ఈ సినిమా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 1971 లో వచ్చిన కృష్ణ కెరీర్ లో ఓ మైలురాయిలాంటి సినిమా ‘మొసగాళ్లకు మోసగాడు’. ఆ పేరుని సుధీర్ బాబు వాడేసుకొని ఈ సినిమాపై ఉన్నగౌరవాన్ని తగ్గించేసాడు.
ఇక అల్లరి నరేష్ సంగతి సరేసరి.ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలు నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్స్ వాడుకొని కంగాళీ చేసేసాడు. ఎన్టీఆర్ ‘బందిపోటు’, చిరంజవి ‘యముడికి మొగుడు’, వెంకటేష్ ‘సందరకాండ’, జంధ్యాల ఆల్ టైమ్ హిట్ ‘అహనా పెళ్లంట’ ఇలా పాత టైటిల్స్‌ను తన కొత్త సినిమాలకు ఎడాపెడా వాడేసుకున్నాడు.
నాగశౌర్య హీరోగా వచ్చిన ఈ చిత్రం కూడా "నర్తనశాల" టైటిల్ పెట్టుకుని దానికి తగ్గట్లుగా అలరించలేకపోతుంది. గే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ టైటిల్ వాడేసుకున్నాడు కానీ అందులో విషయం మాత్రం అంతగా లేదు. దాంతో ఇలా లెజెండరీ టైటిల్స్ వాడుకుని వాటికి ఉన్న పేరు నాశనం చేయడం కంటే ఏదో ఓ టైటిల్ వాడుకోవచ్చు కదా అంటున్నారు అభిమానులు. మరి వీటిని చెవిన పెట్టుకుంటారో లేదో దర్శకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chiranjeevi, Jr ntr, Karthi, Nani, NTR, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda