Mahesh Babu Namrata: పొరపాటు చేసిన నమ్రత.. మహేశ్ బాబుకు చెప్పిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..

మహేశ్ బాబు, నమ్రత (ఫైల్ ఫోటో)

Mahesh Babu Namrata: ఒక్కడు సినిమా గురించి నమ్రత చేసిన పోస్ట్‌లో జరిగిన పొరపాటు గురించి నిర్మాత ఎంఎస్ రాజు ప్రస్తావించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో అనేక సూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఆయన కెరీర్‌లో ఫస్ట్ మాస్ హిట్‌గా నిలిచిన సినిమా మాత్రం ఒక్కడు అనే చెప్పాలి. 18 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా మహేశ్ బాబుకు స్టార్ హీరో రేంజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. సినిమాలో నటించిన వాళ్లు.. తెరవెనుక పని చేసిన వాళ్లంతా ఈ బ్లాక్ బస్టర్‌ను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు భార్య నమ్రత ఈ సినిమా గురించి ప్రస్తావించింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఈ సినిమా సక్సెస్‌ను ప్రస్తావిస్తూ ఇది తనకు నచ్చిన క్లాసిక్ మూవీ అని పోస్ట్ చేసింది.

    అయితే ఈ సినిమా గురించి చెబుతూ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు గురించి ఆమె ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే నమ్రత పోస్ట్ గురించి నిర్మాత ఎంఎస్ రాజు కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొరపాట్లు జరుగుతుంటాయని.. ఒక్కడు సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నమ్రత చేసిన పోస్టులో తన పేరు మర్చిపోయారని ఎంఎస్ రాజు అన్నారు. అయితే ఆమె ఈ సినిమా తన ఫేవరెట్ క్లాసిక్ అని చెప్పడం సంతోషంగా ఉందని సున్నితంగా సెటైర్ వేశారు. ఈ పోస్ట్ గురించి మహేశ్ బాబుకు తెలిసేలా ఆయనకు ట్యాగ్ చేశారు.



    ఒకప్పుడు మహేశ్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నిర్మాత ఎంఎస్ రాజు.. ఆ తరువాత వరుస పరాజయాలతో కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ఆయన కుమారుడు సుమంత్‌ను హీరోగా పరిచయం చేసినప్పటికీ.. అతడు సక్సెస్ కాలేకపోయాడు. అయితే ఇటీవల మళ్లీ మూవీ మేకింగ్‌లో యాక్టివ్ అయిన ఎంఎస్ రాజ్.. డర్టీ హరీ అనే సినిమా తీశారు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: