ఓ మై గాడ్.. నాగార్జున అంత పనిచేసాడా..

శకునం చెప్పే బల్లి కుడితితో పడ్టట్టు.. ప్రజలందరూ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరిన నాగార్జున..తీరా ఎన్నికల సమయంలో ఓటు వేయకపోవడం ఇపుడు సంచలనంగా మారింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 16, 2019, 11:56 AM IST
ఓ మై గాడ్.. నాగార్జున అంత పనిచేసాడా..
నాగార్జున
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 16, 2019, 11:56 AM IST
శకునం చెప్పే బల్లి కుడితితో పడ్టట్టు.. ప్రజలందరూ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరిన నాగార్జున..తీరా ఎన్నికల సమయంలో ఓటు వేయకపోవడం ఇపుడు సంచలనంగా మారింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసేలా ప్రేరేపించండి అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు ఇండియాలో ఉన్న మిగిలిన ఇండ‌స్ట్రీల్లో ఉన్న స్టార్ హీరోల‌ను కూడా అభిమానుల‌ను ఓటేసేలా చెప్పండంటూ ట్వీట్ చేసాడు ప్ర‌ధాని మోడీ. అవ‌గాహ‌న క‌లిగించేలా మీరు మీ పాత్ర పోషించండి అంటూ మోహ‌న్ లాల్, నాగార్జున‌కు ట్వీట్ చేసాడు మోడీ. అలాగే ఓటింగ్ పెరిగేలా ప్రోత్సహిస్తామంటూ నాగార్జున..ప్రధాని మోదీకి రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

nagarjuna,nagarjuna twitter,nagarjuna pm narendra modi,nagarjuna vote,nagarjuna didnot goto vote,telugu top star,tollywood,tollywood news,nagarjuna akkineni twitter,akhil akkineni,akhil twitter,akkineni nagarjuna,akkineni amala,naga chaitanya,samantha,telangana lok sabha elections,manmadhudu 2,అక్కినేని నాగార్జున,ఓటు వేయని నాగార్జున,ఓటువేయకుండా నాగార్జున షూటింగ్,మన్మథుడు2 షూటింగ్,పోర్చుగల్,తెలంగాన లోక్‌సభ పోల్స్,
మోడీ నాగార్జున ఫైల్ ఫోటో


అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న నాగ్... లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటు వేయలేదు. ఆ సమయంలో ఆయన తను నటిస్తున్న మన్మథుడు సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఓటింగ్‌లో పాల్గొనకుండా పోర్చుగల్ ఫ్లైట్ ఎక్కారు.దీంతో ఓటు వేయాలని చెప్పిన మీరు..ఇలా ఓటేయకుండా ఫ్లైట్ ఎక్కడం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు నాగార్జున ఫ్యామిలీలో అఖిల్ కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరోవైపు నాగార్జున భార్య అమల, కొడుకు,కోడలు నాగ చైతన్య, సమంత విధిగా ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం.

First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...