ప్రభాస్ అంటే క్రష్ అంటున్న ఆ లేడీ డైరెక్టర్..

ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తాజాగా రెబల్ స్టార్ ఫ్యాన్ లిస్టులో మరో మహిళ దర్శకురాలు కూడా చేరింది.

news18-telugu
Updated: June 26, 2019, 3:59 PM IST
ప్రభాస్ అంటే క్రష్ అంటున్న ఆ లేడీ డైరెక్టర్..
ప్రభాస్ (ఫైల్ ఫొటో)
  • Share this:
ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్‌ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. త్వరలో ‘సాహో’ అంటూ పలకరించబోతున్నాడు. ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందులో మహిళ అభిమానులు ఉన్నారు. అందులో బాలీవుడ్ టాప్ కథానాయికలైన దీపికా, కంగనా వంటి హీరోయిన్స్ కు కూడా ప్రభాస్ అంటే ఇష్టమని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక ప్రభాస్ అంటే ఇష్టమనే చెప్పిన మహిళ దర్శకుల్లో నందిని రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమె సమంత ప్రధాన పాత్రలో ‘ఓ బేబి’ సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇపుడున్న హీరోల్లో ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. మొత్తానికి ‘ఓ బేబి’ ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు కూడా నందిని రెడ్డి ఓ బిస్కెట్ ఏసిందిని మిగతా వాళ్లు నందిని రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.

First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>