‘ఓ బేబీ’ ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌మంత దూకుడు..

స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఓ బేబీ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చూపిస్తుంది. గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెర‌కెక్కించింది. ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో క‌లెక్ష‌న్ల రూపంలో క‌నిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 8, 2019, 1:56 PM IST
‘ఓ బేబీ’ ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌మంత దూకుడు..
సమంత ఓ బేబీ కటౌట్
  • Share this:
స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఓ బేబీ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చూపిస్తుంది. గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెర‌కెక్కించింది. ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఇప్పుడు క‌లెక్ష‌న్ల రూపంలో ఆ ప్ర‌భావం క‌నిపిస్తుంది. స‌మంత క్రేజ్.. మార్కెట్ ఈ సినిమాకు ప‌నికొస్తుంది. 70 ఏళ్ల బామ్మ.. పాతికేళ్ల భామ‌గా మారిపోతే త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నే క‌థ‌తో ఓ బేబీ వ‌చ్చింది. విభిన్న‌మైన ప్ర‌య‌త్నంగా ఉన్న ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల ఆమోద‌ముద్ర కూడా బాగానే ప‌డుతుంది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 8 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.17 కోట్ల‌కు పైగా గ్రాస్ తీసుకొచ్చి ఔరా అనిపించింది ఓ బేబీ. యు ట‌ర్న్ సినిమాకు అప్ప‌ట్లో టాక్ బాగానే వ‌చ్చినా క‌లెక్ష‌న్లు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓ బేబీ క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌త్తా చూపిస్తుంది. వీక్ డేస్‌లో ఈ సినిమా ఎలా వ‌సూలు చేస్తుంద‌నేదాన్ని బ‌ట్టి సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంది. క‌చ్చితంగా పుల్ ర‌న్‌లో 12 కోట్ల వ‌ర‌కు ఓ బేబీ క‌లెక్ట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Published by: Praveen Kumar Vadla
First published: July 8, 2019, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading